Kishan Reddy : కామారెడ్డిలో కేసీఆర్‌ను గెలిపించడానికి కాంగ్రెస్ కుట్ర.. అయినా రెండూ చోట్లా ఓటమే : కిషన్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ పోటీ చేసిన రెండు చోట్లా, కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. నామినేషన్లను ఉపసంహరించుకోవాలని పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. 

union minister kishan reddy slams congress party and brs ksp

తెలంగాణ సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  గజ్వల్ , కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించారని ఆరోపించారు. ఓటమి భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. గజ్వేల్‌లో 114 మంది ధరణి బాధితులు , కామారెడ్డిలో 58 మంది బాధితులు నామినేషన్ దాఖలు చేశారని కేంద్ర మంత్రి చెప్పారు. అయితే నామినేషన్లను ఉపసంహరించుకోవాలని పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. 

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తరపున 39 మంది బీసీలు బరిలో వున్నారని.. కానీ కాంగ్రెస్ నుంచి 22 మంది, బీఆర్ఎస్ నుంచి 23 మంది మాత్రమే పోటీ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బీసీల గురించేది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని.. అందుకే కేసీఆర్ గజ్వేల్ నుంచి కామారెడ్డికి పారిపోయారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్ పోటీ చేసిన రెండు చోట్లా, కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చీ కామారెడ్డిలో కేసీఆర్‌ను గెలిపించేలా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios