ప్రపంచానికి ఫార్మసీ, వ్యాక్సిన్ రాజధానిగా హైద్రాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
జీ 20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఆదివారంనాడు హైద్రాబాద్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్:ప్రపంచానికి ఫార్మసీ, వ్యాక్సిన్ రాజధాని హైద్రాబాద్ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.హైద్రాబాద్ లో జీ 20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ మూడో సమావేశం ఆదివారంనాడు జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. నాణ్యమైన వైద్య విధానాలు , భారత్ లో శతాబ్దాల క్రితమే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఆయుర్వేదం, సిద్ద, యునానీ, మోగా వంటి శతాబ్దాల క్రితమే ఉన్నాయని ఆయన ప్రస్తావించారు.
హెల్త్ టూరిజంలో టాప్ 10 దేశాల్లో భారత్ ఒకటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.వ్యాక్సిన్లలో 33 శాతం భారత్ లోనే తయారౌతున్నాయని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. 2030 నాటికి యూనివర్శిల్ హెల్త్ కేర్ కవరేజ్ సాధనకు కృషి చేస్తున్నామన్నారు.