Asianet News TeluguAsianet News Telugu

ఇంటెలిజెన్స్ పోలీసులు బీజేపీ కార్యాలయంలోకి ఎలా వస్తారు?.. మరోసారి వస్తే బాగోదు: కిషన్ రెడ్డి ఫైర్

తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులపై కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ పోలీసులు బీజేపీ కార్యాలయంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. 

Union Minister Kishan Reddy Fires on Telangana Intelligence police
Author
First Published Oct 2, 2022, 2:21 PM IST

తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులపై కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ పోలీసులు బీజేపీ కార్యాలయంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఫోన్లను ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా అంటూ మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ పోలీసులు పార్టీ కార్యాలయం లోనికి వస్తే బాగోదని కిషన్ రెడ్డి హెచ్చరించారు.  ప్రగతి భవన్, తెలంగాణ భవన్‌లో  ఐబీని(ఇంటెలిజెన్స్ బ్యూరో) వాళ్లను పెడతా సీఎం కేసీఆర్ ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. అక్కడ ఒప్పుకుంటే.. బీజేపీ ఆఫీస్‌లో ఇంటెలిజెన్స్‌కు రూమ్ కేటాయిస్తానని అన్నారు. 

ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్‌బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ, శాస్త్రిల చిత్రపటాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, సునీల్ బన్సల్, ఈటల రాజేందర్ నివాళులర్పించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయుల ఆత్మగౌరవం పెంచాలని గాంధీ చెప్పారని అన్నారు. గాంధీ ఆశయాలను నెరవేర్చడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. యుద్ద విమానాల నుంచి వ్యాక్సిన్ వరకు మన దేశంలోనే తయారీ చేస్తున్నట్టుగా తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios