యుద్ధం మొదలైంది, నేనేమైనా ఉగ్రవాదినా?: కేసీఆర్ సర్కార్ పై కిషన్ రెడ్డి ఫైర్

బాట సింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించకుండా పోలీసులు అడ్డుకోవడంపై  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేశారు.

Union Minister Kishan Reddy Fires On KCR  Government lns

హైదరాబాద్:యుద్ధం మొదలైందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.యుద్ధాన్నిబీఆర్ఎస్  ప్రారంభించిందన్నారు. యుద్ధానికి తాము  కూడ సిద్ధమని కిషన్ రెడ్డి  తేల్చి చెప్పారు. పేదలు, బడుగుల కోసం యుద్ధం  చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  తెలిపారు.

బాటసింగారం వద్ద డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు  వెళ్లకుండా  శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుండి ఆయనను బీజేపీ కార్యాలయానికి తీసుకు వచ్చారు. బీజేపీ కార్యాలయంలో గురువారంనాడు  ఆయన మీడియాతో మాట్లాడారు.

బాట సింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.  అరకొర కట్టిన ఇళ్లను కూడ  ఇంతవరకు  పేదలకు  పంచలేదని  కిషన్ రెడ్డి విమర్శించారు. పేద ప్రజల పట్ల బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మంత్రి చెప్పారు. 

also read:డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై బీజేపీ పోరు: శంషాబాద్ నుండి బీజేపీ కార్యాలయానికి కిషన్ రెడ్డి

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి తనను  ఉగ్రవాదిగా వెంటాడారన్నారు.   తానేమైనా ఉగ్రవాదినా, నేరస్తుడినా అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.  మానవత్వం  లేకుండా పోలీసులు వ్యవహరించారని  కిషన్ రెడ్డి మండిపడ్డారు. అకారణంగా బీజేపీ శ్రేణులను అరెస్ట్  చేశారన్నారు. ఉద్యమం, ధర్నా కాదని  చెప్పినా కూడ వందలాది  మంది పోలీసులను పెట్టి అడ్డుకున్నారని కేంద్ర మంత్రి చెప్పారు.  

తమ పార్టీ కార్యాలయం ముందు  కూడ భారీ ఎత్తున పోలీసులను మోహరించడాన్ని  కిషన్ రెడ్డి తప్పుబట్టారు. తమ పార్టీకి చెందిన నేతలను  పోలీసులు హౌస్ అరెస్ట్  చేశారని  కిషన్ రెడ్డి గుర్తు  చేశారు. హౌస్ అరెస్ట్ ఎందుకు  చేశారని  ఆయన ప్రశ్నించారు.  వీటన్నింటిని పరిశీలిస్తే కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారని అర్థమౌతుందన్నారు. అందుకే తమను అరెస్ట్  చేస్తున్నారని  కిషన్ రెడ్డి  విమర్శించారు. దమ్ము, ధైర్యం ఉంటే  50 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తే కేంద్రం నుండి  నిధులను తీసుకువస్తానని  కిషన్ రెడ్డి  స్పష్టం చేశారు.
 

.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios