తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తున్న  సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్వరలోనే తెలంగాణలో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 23న అమిత్ షా తెలంగాణ పర్యటన రానున్నరని తెలుస్తోంది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్బంగా పార్టీలో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు చేరే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.