Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై త్వరలోనే స్పష్టత: కేంద్ర మంత్రి అమిత్ షా

ఎన్‌డీఏలో చేరికల విషయంలో  కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా  కీలక  వ్యాఖ్యలు చేశారు.

 Union Minister Amit Shah Key Comments on Alliance in Andhra Pradesh lns
Author
First Published Feb 10, 2024, 2:33 PM IST | Last Updated Feb 10, 2024, 3:06 PM IST

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులు త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.న్యూఢిల్లీలో శనివారం నాడు  ఓ పత్రిక నిర్వహించిన సదస్సులో  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ మిత్రులను తాము ఎప్పుడూ బయటకు పంపలేదన్నారు.రాజకీయ సమీకరణాల దృష్ట్యా వాళ్లు బయటకు వెళ్లారని అమిత్ షా గుర్తు చేశారు.ఎన్‌డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని అమిత్ షా చెప్పారు.

also read:రెండు రోజుల క్రితం బీజేపీ నేతలతో బాబు: నేడు మోడీతో జగన్ భేటీ

దేశ వ్యాప్తంగా ఎన్‌డీఏను విస్తరించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో దేశంలో  400కిపైగా పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలనే టార్గెట్ పెట్టుకున్నామని ఆయన చెప్పారు.బీజేపీకి  350 ఎంపీ సీట్లు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశం సంక్షేమం తిరిగి ఎన్‌డీఏలో చేరాలని పాత మిత్రులు భావిస్తే వారికి తలుపులు తెరిచే ఉంటాయని  అమిత్ షా చెప్పారు.ఎన్‌డీఏను బలోపేతం చేసుకుంటామన్నారు.ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కుటుంబంలో కీలకమని చెప్పారు.ఫ్యామిలీ ప్లానింగ్ రాజకీయాల్లో మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఎంత పెద్ద కుటుంబం ఉంటే అంత మంచిదన్నారు.పంజాబ్ లో పాత మిత్రులు అకాళీదళ్ తో కూడ పొత్తు పెట్టుకోబోతున్నామన్నారు. బీహార్ లో నితీష్ కుమార్  తిరిగి ఎన్‌డీఏలోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎన్‌డీఏ విస్తరణ గురించి  ఈ సమావేశంలో  అడిగిన ప్రశ్నకు అమిత్ షా నవ్వుతూ సమాధానం చెప్పారు.టీవీ డిబేట్ వేదికగానే రాజకీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్నారు.  ఈ విషయమై తమకు కొంత సమయం ఇవ్వాలన్నారు. పొత్తులపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు.

also read:ప్రాణాపాయంలో వ్యక్తి: రైలును తోసిన ప్రయాణీకులు

ఈ నెల  7వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డాతో  టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  భేటీ అయ్యారు.ఈ నెల  9వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగు దేశం పార్టీ జనసేన పొత్తు కుదుర్చుకుంది. ఈ కూటమిలో బీజేపీ కూడ చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.  చంద్రబాబు బీజేపీ  అగ్రనేతలతో భేటీ  కావడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios