Asianet News TeluguAsianet News Telugu

ప్రాణాపాయంలో వ్యక్తి: రైలును తోసిన ప్రయాణీకులు

రైలు ఎక్కే సమయంలోనూ, దిగే సమయంలోనూ ఏమరుపాటుగా ఉంటే  ప్రమాదాలు జరుగుతాయి.  ఇదే తరహా ప్రమాదం ఒకటి  ముంబైలో చోటు చేసుకుంది.

Passengers push local train in Mumbai to save trapped man lns
Author
First Published Feb 10, 2024, 10:14 AM IST | Last Updated Feb 10, 2024, 10:27 AM IST

న్యూఢిల్లీ: రైలుకింద పడిన ప్రయాణీకుడిని కాపాడేందుకు  తోటి ప్రయాణీకులు  రైలును తోశారు.  ముంబైలోని  వాషి రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.  ఇందుకు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెడిట్  సోషల్ మీడియా వినియోగదారుడు ఈ విషయాన్ని  ధృవీకరించారు.  ఇదే రైలులో తాను ప్రయాణీస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

also read:ఆపరేషన్ థియేటర్‌లో ఫ్రీ వెడ్డింగ్ షూట్: డాక్టర్ సస్పెన్షన్

ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ దృశ్యం చూడడానికి  చాలా సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం  అందరూ ఐక్యంగా నిలిచారన్నారు. మానవత్వం ఇంకా ఉందని చెప్పడానికి ఈ దృశ్యం నిదర్శనమని మరొకరు వ్యాఖ్యానించారు. కదులుతున్న రైలు నుండి దూకిన ప్రయాణీకుడిదే బాధ్యత అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.

also read:దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: పీ.వీ.కి భారత రత్న, కాంగ్రెస్‌పై పైచేయి

రైలు ఎక్కే సమయంలో, దిగే సమయంలో  ఏమరుపాటుగా ఉంటే  ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.  ముంబైలోని పలు రైల్వేస్టేషన్లలో రైలు ఎక్కే సమయంలో దిగే సమయంలో ఈ తరహా ప్రమాదాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by The Indian Feed (@theindianfeed) కదులుతున్న రైలును ఎక్కడం లేదా దిగడం చేయవద్దని  రైల్వే అధికారులు సూచిస్తున్నారు. కానీ ప్రయాణీకులు మాత్రం  ఈ విషయాలను పట్టించుకోవడం లేదు.  ఏమరుపాటుగా ఉండడం లేదా  రైలు ఎక్కే లేదా దిగే సమయాల్లో  నియంత్రణ కోల్పోవడంతో  ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.  రైల్వే స్టేషన్లలో ప్రమాదాలు జరిగిన సమయాల్లో  తోటి ప్రయాణీకులు లేదా  పోలీస్ సిబ్బంది పలువురిని కాపాడిన ఘటనలు కూడ దేశ వ్యాప్తంగా అనేకం నమోదైన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios