వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సర్కార్: ఖమ్మంలో కేసీఆర్ పై అమిత్ షా ఫైర్

ఖమ్మంలో  ఇవాళ  రైతు గోస-బీజేపీ భరోసా సభలో కేంద్ర హోం మంత్రి  అమిత్ షా పాల్గొన్నారు.
 

Union Minister  Amit Shah Allegations on  Telangana CM KCR in Khammam Meeting lns

ఖమ్మం: కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  చెప్పారు.ఖమ్మంలో  ఆదివారంనాడు నిర్వహించిన రైతు గోస- బీజేపీ భరోసా సభలో  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. 

కేసీఆర్ సర్కార్ ను గద్దె దింపాలా వద్దా బీజేపీ సర్కార్ కావాలా వద్దా అని  అమిత్ షా ఖమ్మం ప్రజలను ప్రశ్నించారు. తిరుపతి  వెంకటేశ్వరుడిని స్మరించుకొని ప్రసంగం ప్రారంభిస్తానని అమిత్ షా చెప్పారు.స్థంభాద్రి లక్ష్మీ నరసింహుని సర్మించుకుని ప్రసంగించనున్నట్టుగా తెలిపారు.

Union Minister  Amit Shah Allegations on  Telangana CM KCR in Khammam Meeting lns

ఎంఐఎం చేతిలో స్టీరింగ్ ఉన్న కారు పార్టీ మనకు కావాలా అని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం చీఫ్ ఓవైసీ పక్కన కూర్చుని  తెలంగాణ విమోచన వీరులను  కేసీఆర్  అవమానిస్తున్నారని  అమిత్ షా ఆరోపించారు. తెలంగాణ అమరుల కలలను కేసీఆర్ కల్లలు చేశారన్నారు. సోనియా కుటుంబం కోసం కాంగ్రెస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం కోసం  బీఆర్ఎస్ పనిచేస్తుందని  అమిత్ షా విమర్శించారు.

కేసీఆర్ పాలనకు  నూకలు చెల్లాయని ఆయన విశ్వాసం వ్యక్తం  చేశారు. హైద్రాబాద్ విముక్తికి  75 ఏళ్లు నిండాయన్నారు. తెలంగాణలో త్వరలో కమలం వికసిస్తుందని  అమత్ షా ధీమాను వ్యక్తం చేశారు.భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన విషయాన్ని  అమిత్ షా గుర్తు చేశారు.శ్రీరామనవమికి పట్టు వస్త్రాలు సమర్పించే  సంప్రదాయాన్ని కేసీఆర్ విస్మరించారన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ కారు  భద్రాచలం వెళ్తుంది.. కానీ  ఆలయం వరకు వెళ్లదని ఆయన ఎద్దేవా చేశారు.కేసీఆర్ ... గుర్తు పెట్టుకోండి ఇక మీ కారు భద్రాచలం  వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.త్వరలోనే బీజేపీ సీఎం భద్రాచలం వెళ్లి  స్వామివారికి పట్టు వస్త్రాలు  సమర్పిస్తారని ఆయన  విశ్వాసం వ్యక్తం చేశారు.

 

అరెస్టులతో  బీజేపీ నేతలను భయపెట్టవచ్చని  కేసీఆర్ భావిస్తున్నారన్నారు.కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ లను అరెస్టులతో భయపెట్టాలని చూశారన్నారు.ఈసారి  సీఎం అయ్యేది  కేసీఆర్ కాదు..కేటీఆర్ కాదు... సీఎం అయ్యేది బీజేపీ నేత మాత్రమేనని  అమిత్ షా తేల్చి చెప్పారు.

also read:ఖమ్మం చేరుకున్న అమిత్ షా: ఘనంగా స్వాగతం పలికిన నేతలు

కాంగ్రెస్ పార్టీ 4 జీ పార్టీ, బీఆర్ఎస్ 2 జీ పార్టీ, ఎంఐఎం 3 జీ పార్టీ అని  వ్యంగ్యాస్త్రాలు సంధించారు.నాలుగు తరాల పార్టీ కాంగ్రెస్ ను 4 జీగా, రెండు తరాల బీఆర్ ఎస్ ను 2 జీ,  మూడు తరాలకు చెందిన ఎంఐఎంను 3 జీ పార్టీ అంటూ  అమిత్ షా సెటైర్లు వేశారు. 

Union Minister  Amit Shah Allegations on  Telangana CM KCR in Khammam Meeting lns

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మోడీజీ పార్టీయేనన్నారు.కేసీఆర్ పక్కన ఒవైసీ  ఉన్నారన్న  సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. కేసీఆర్, ఓవైసీతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని  అమిత్ షా తేల్చి చెప్పారు.వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓడిపోతుందని ఆయన ధీమాను వ్యక్తం  చేశారు.వచ్చే ఎన్నికల్లో  వికసించేది కమలమేనని ఆయన  విశ్వాసం వ్యక్తం  చేశారు.తెలంగాణ రైతులు పండించే ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు.తెలంగాణ ప్రజలను  కేసీఆర్ మోసం చేశారని అమిత్ షా  విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఆనాడు రైతులకోసం 22వేల కోట్ల బడ్జెట్ పెడితే.. ఇవాళ మోదీ ప్రభుత్వం.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ.. లక్షా28వేల కోట్ల బడ్జెట్  కేటాయించిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకోసం 7 లక్షల కోట్ల అప్పులు, ఇతర సబ్సిడీలిస్తే.. మోదీ ప్రభుత్వం20 లక్షలకోట్ల విలువైన సహాయ సహకారాలు అందిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 475 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందన్నారు. కానీ మోదీ ప్రభుత్వం 900 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించిన విషయాన్ని అమిత్ షా వివరించారు.బియ్యం మీద కనీస మద్దతు ధర 67శాతం పెరిగిందన్నారు. 11కోట్ల మంది రైతులకు, 2.60 లక్షల కోట్ల కిసాన్ సమృద్ధి నిధిని అందిస్తోందన్నారు.నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని చేసిన విమర్శలను అమిత్ షా ప్రస్తావిస్తూ  ఏం జరిగినా  కూడ  కేసీఆర్, ఎంఐఎంతో పొత్తు పెట్టుకొనే ప్రసక్తే లేదన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు  యూపీఏ సర్కార్ 2 లక్షల కోట్ల నిధులు ఇస్తే.తమ సర్కార్ ఒక్క తెలంగాణకే 2.80 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని ఆయన  ఆరోపించారు.తెలంగాణలో మోడీ సర్కార్ 33 లక్షల మంది పేదలకు మరుగుదొడ్లు కట్టించిందన్నారు.కేసీఆర్ ను ఇంటికి పంపి.. బీజేపీని అధికారంలోకి తీసుకొద్దాం అని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios