Asianet News TeluguAsianet News Telugu

అమిత్ షా తెలంగాణ పర్యటనలో కీలక పరిణామం .. భేటీకానున్న పీవీ సింధు

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎల్లుండి హైదరాబాద్‌కు రానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో ఆయన భేటీ కానున్నారు. 

indian badminton player pv sindhu to meet union home minister amit shah in hyderabad ksp
Author
First Published Sep 15, 2023, 6:09 PM IST

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎల్లుండి హైదరాబాద్‌కు రానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో ఆయన భేటీ కానున్నారు. క్రీడా, రాజకీయ రంగాల్లో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఈ నెల  17న అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే  తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో  అమిత్ షా పాల్గొంటారని బీజేపీ నేతలు  తెలిపారు. గత ఏడాది కూడా  కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని  నిర్వహించారు.  ఈ సందర్భంగా నిర్వహించిన సభలో  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.  

ఈ దఫా  కూడ  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ తలపెట్టింది. ఇందులో భాగంగానే  ఈ నెల  17న  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో  ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని  బీజేపీ పట్టుదలతో ఉంది. ఈ మేరకు  బీజేపీ నాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.  తెలంగాణ విమోచన దినోత్సవం  సందర్భంగా సభ నిర్వహించిన తర్వాత  రాష్ట్రంలో బస్సు యాత్ర నిర్వహించాలని  బీజేపీ భావిస్తుంది. రాష్ట్రంలో మూడు చోట్ల నుండి  బస్సు యాత్రలు  ప్రారంభించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ యాత్రల ముగింపు  సందర్భంగా  హైద్రాబాద్‌లో మరో సభను కూడా నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios