Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్ రూబీ లాడ్జీ అగ్ని ప్రమాదం: కేంద్ర రవాణా శాఖ దర్యాప్తు

సికింద్రాబాద్ రూబీ లాడ్జీలో అగ్ని ప్రమాదం ఘటనపై కేంద్ర రవాణా శాఖ దర్యాప్తును ప్రారంభించింది. ఈ లాడ్జీ సెల్లార్ లో ఉన్న ఈ బైక్ ల బ్యాటరీలే పేలుడే అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు గుర్తించారు. ఈ అగ్ని ప్రమాదంలో 8 మంది మరణించారు.
 

Union govt orders probe into Secunderabad e-bike showroom fire
Author
First Published Sep 14, 2022, 11:01 AM IST

హైదరాబాద్: సికింద్రాబాద్ రూబీ  లాడ్జీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై కేంద్ర రవాణా శాఖ దర్యాప్తును ప్రారంభించింది.  రూబీ లాడ్జీ భవనం ఉన్న సెల్లార్ లో మంటలు వ్యాపించాయి. అయితే ఈ మంటలకు ఈ బైక్స్ లో బ్యాటరీల పేలుడే కారణమనే అనుమానాలు  వ్యక్తమౌతున్నాయి.ఈ  బైక్స్ ఓవర్ చార్జీంగ్ కారణంగా పేలుడు చోటు చేసుకుందనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ బైక్స్  తరచూ ప్రమాదానికి గురి కావడంపై కేంద్ర రవాణా  శాఖ దర్యప్తును ప్రారంభించింది. 

ఎలక్ట్రిక్ బైక్స్ తరచూ ప్రమాదానికి గురౌతున్నాయి.ఈ బైక్స్ ప్రమాదాలకు బ్యాటరీల తయారీలో లోపాలు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ఈ బైక్ లలోని బ్యాటరీలు పేలి  మరణించిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఈ ప్రమాదాలపై  కేంద్ర రవాణాశాఖ సీరియస్ అయింది. ఈ బైక్స్ లో లోపాలను గుర్తించి వాటిని సరి చేయాలని ఈ బైక్స్ తయారీ సంస్థలను ఆదేశించింది. దీంతో దేశంలో ఈ బైక్స్ తయారు చేస్తున్న మూడు సంస్థలు తాము తయారు చేసిన బైకులలో లోపాలు ఉన్నవాటిని వెంటనే వెనక్కి తీసుకుంది. మూడు ఈ బైక్ తయారీ సంస్థలు సుమారు 7 వేల ఈ బైక్స్ ను వెనక్కి తీసుకున్నాయి. 

ఎలక్ట్రిక్ బైక్ లలో చోటు చేసుకున్న భద్రతా ప్రమాణాల్లో లోపాలను గుర్తించేందుకు కేంద్ర రవాణా శాఖ ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ పలు సూచనలు చేసింది. ఈ సూచనలు పాటించని ఈ బైక్ తయారీ సంస్థలపై  జరిమానా విధిస్తామని కేంద్ర రవాణా శాఖ హెచ్చరించింది. ఈ బైక్స్ లలో బ్యాటరీ భద్రతా ప్రమాణాలు పాటించడంపై కేంద్రీకరించాలని కేంద్రం సూచించింది. 

సికింద్రాబాద్ లో రూబీ లాడ్జీ ప్రమాదానికి కారణమైన ఈ బైక్స్ బ్యాటరీ పేలుడుకు గల కారణాలపై కేంద్ర రవాణాశాఖకు చెందిన అధికారుల బృందం విచారణ చేయనుంది.  ఏఆర్‌సీఐ హైద్రాబాద్ డైరెక్టర్ నర్సింగరావు నేతృత్వంలో కమిటీని కేంద్ర రవాణా శాఖ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రూబీ లాడ్జీలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ నిర్వహించనుంది.  

alo read:సికింద్రాబాద్ రూబీ లాడ్జీలో అగ్ని ప్రమాదం: రంజిత్ సింగ్ బగ్గ సహ నలుగురు అరెస్ట్

రూబీ లాడ్జీ ఉన్నభవనం సెల్లార్ లో ఉన్నఈ బైక్స్ బ్యాటరీల పేలుడుతోనే అగ్ని ప్రమాదం జరిగిందని అగ్ని మాపక శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఓవర్ చార్జింగ్ కాారణంగానే ఈ ప్రమాదం జరిగిందనే అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios