Asianet News TeluguAsianet News Telugu

శుభవార్త: కొత్త జోన్లకు ఆమోదం తెలిపిన కేంద్రం, గెజిట్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకొన్న కొత్త జోన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. 
 

union government accepted for New zones in telangana
Author
Hyderabad, First Published Aug 30, 2018, 12:40 PM IST


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకొన్న కొత్త జోన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా  కేసీఆర్ సర్కార్  కొత్తగా జోన్లను  ఏర్పాటు చేసుకొంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  ఆరు జోన్లు మాత్రమే ఉండేవి. 5, 6 జోన్లు మాత్రమే  తెలంగాణలో ఉండేవి. మిగిలిన నాలుగు జోన్లు  ఏపీ రాష్ట్రంలో ఉండేవి.


 తెలంగాణలో  95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా జోన్ల వ్యవస్థను మార్చేసింది.రాష్ట్రం విడిపోయినందున  తెలంగాణ రాష్ట్ర అవసరాల మేరకు జోన్లను విభజించారు. ఉమ్డి ఏపీరాష్ట్రంలో జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోస్టుల్లో రిక్రూట్ మెంట్ జరిగేది. హైద్రాబాద్ రాష్ట్రం, ఏపీ విలీనమైన సందర్భంలో  రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఈ జోన్ల వ్యవస్థ అమల్లోకి వచ్చింది.రాష్ట్రాల విభజన పూర్తైన తర్వాత తెలంగాణ రాష్ట్ర అవసరాల మేరకు జోన్ల వ్యవస్థను మార్చుకొంది తెలంగాణ సర్కార్.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 371 డి ఆర్టికల్ ఉంది.రాష్ట్రాలు విడిపోయినా తర్వాత కూడ ఈ ఆర్టికల్ రెండు రాష్ట్రాలకు వర్తిస్తోంది.రెండు రాష్ట్రాల్లో జోనల్ వ్యవస్థలున్నాయి.ఉమ్మడి రాష్ట్రంలో ఆరు జోన్లు ఉండేవి. తెలంగాణ రాష్ట్రానికి 5, 6 జోన్ లున్నాయి..ఒకటి నుండి నాలుగు జోన్లు సీమాంద్ర జిల్లాల్లో ఉండేవి.ఐదు,ఆరు జోన్లు తెలంగాణ జిల్లాల్లో ఉండేవి.అన్ని ప్రాంతాలవారికి సమాన అవకాశాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి.

ఆ సమయంలో  అందరికీ సమాన అవకాశాలను కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రపతి ఉత్తర్వులను అమల్లోకి తెచ్చారు. భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో రాష్ట్రాల విలీనం జరిగిన నేపథ్యంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు  ఉద్యోగ, ఉపాధి, విద్య తదితర అన్ని రంగాల్లో  సమాన అవకాశాలను కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ ఉత్తర్వులు అమల్లోకి తెచ్చారు.

అయితే రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత కూడ ఈ రెండు రాష్ట్రాల్లో కూడ  ఈ జోన్ల వ్యవస్థ కొనసాగుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఇటీవలనే  తమ రాష్ట్రానికి అనుగుణంగా జోన్లను మార్చేసింది. 31 జిల్లాలను తెలంగాణలో ఏర్పాటు చేసినందున రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 31 జిల్లాలకు గాను 7 జోన్లతో పాటు రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేశారు. ప్రతి జోన్‌లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు రిజర్వ్ చేశారు. 5శాతం ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీలో ఉంటాయి.

రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నందున 371 డీ ని సవరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఆగష్టు మూడో తేదీన కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. మరో సారి వారం రోజుల క్రితం కూడ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కొత్త జోన్ల గురించి వివరించారు.ఈ మేరకు  మోడీ కొత్త జోన్ల ఫైలుపై సంతకం పెట్టి పంపారు. గురువారం నాడు గెజిట్ వెలువడింది.

 

కొత్త జోన్లు ఇవే

1. కాళేశ్వరం జోన్: ఈ జోన్ లో 28.29 లక్షల జనాభా ఉంది. ఈ జోన్ లోకి భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలు వస్తాయి.

2. బాసర జోన్: ఈ జోన్ లో 39.74 లక్షల జనాభా ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో ఈ జోన్ లోకి వస్తాయి. 

3. రాజన్న జోన్: ఈ జోన్ లో 43.09 లక్షల జనాభా ఉంది. ఈ జోన్ లోకి కరీంనగర్, సిద్ధిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు వస్తాయి. 

4. భద్రాద్రి జోన్: ఈ జోన్ లోకి 50.44 లక్షల జనాభా ఉంది. ఈ జోన్ లో వరంగల్ గ్రామీణ, వరంగల్ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు వస్తాయి. 

5. యాదాద్రి జోన్: ఈ జోన్ లో 45.23 లక్షల జనాభా ఉంది. ఈ జోన్ లోకి సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు వస్తాయి. 

6. చార్మినార్ జోన్: ఈ జోన్ లో 1.03 కోట్ల జనాభా ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు ఈ జోన్ లోకి వస్తాయి. 

7. జోగులాంబ జోన్: ఈ జోన్ లో 44.63 లక్షల జనాభా ఉంది. మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు, వికారాబాద్

బహుళ జోన్ల పరిధిలోకి ఈ కింది జోన్లు వస్తాయి..

1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాది (1.61 కోట్ల జనాభా)
2. యాదాద్రి, చార్మినార్, జోగులాబం (1.88 కోట్ల జనాభా)
 

ఈ వార్తలు చదవండి

తెలంగాణలో కొత్త జోన్లు ఇవే: ఏయే జిల్లాలు ఏ జోన్లలోకి...

కేసీఆర్ హ్యాపీ: కొత్త జోనల్ వ్యవస్థకు మోడీ గ్రీన్ సిగ్నల్

జోనల్ వ్యవస్థ అంటే ఏమిటీ?: మోడీ చేతికి చిక్కిన కేసీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios