Asianet News TeluguAsianet News Telugu

జోనల్ వ్యవస్థ అంటే ఏమిటీ?: మోడీ చేతికి చిక్కిన కేసీఆర్

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జోన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  మార్చివేసింది.కొత్త జోన్ల వ్యవస్థను మార్చుకొంది. కొత్త జిల్లాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసినందున కొత్తగా  జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకొంది. 

Telangana: What is the zonal system


హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జోన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  మార్చివేసింది.కొత్త జోన్ల వ్యవస్థను మార్చుకొంది. కొత్త జిల్లాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసినందున కొత్తగా  జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకొంది. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా జోన్ల వ్యవస్థను మార్చేసింది. అయితే కొత్త జోన్లకు కేంద్రం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.ఈ మేరకు  సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  ఆరు జోన్లు ఉండేవి. అయితే రాష్ట్రం విడిపోయినందున  తెలంగాణ రాష్ట్ర అవసరాల మేరకు జోన్లను విభజించారు. ఉమ్డి ఏపీరాష్ట్రంలో జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోస్టుల్లో రిక్రూట్ మెంట్ జరిగేది. హైద్రాబాద్ రాష్ట్రం, ఏపీ విలీనమైన సందర్భంలో  రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఈ జోన్ల వ్యవస్థ అమల్లోకి వచ్చింది.రాష్ట్రాల విభజన పూర్తైన తర్వాత తెలంగాణ రాష్ట్ర అవసరాల మేరకు జోన్ల వ్యవస్థను మార్చుకొంది తెలంగాణ సర్కార్.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 371 డి ఆర్టికల్ ఉంది.రాష్ట్రాలు విడిపోయినా తర్వాత కూడ ఈ ఆర్టికల్ రెండు రాష్ట్రాలకు వర్తిస్తోంది.రెండు రాష్ట్రాల్లో జోనల్ వ్యవస్థలున్నాయి.ఉమ్మడి రాష్ట్రంలో ఆరు జోన్లు ఉండేవి. తెలంగాణ రాష్ట్రానికి 5, 6 జోన్ లున్నాయి..ఒకటి నుండి నాలుగు జోన్లు సీమాంద్ర జిల్లాల్లో ఉండేవి.ఐదు,ఆరు జోన్లు తెలంగాణ జిల్లాల్లో ఉండేవి.అన్ని ప్రాంతాలవారికి సమాన అవకాశాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి.

ఆ సమయంలో  అందరికీ సమాన అవకాశాలను కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రపతి ఉత్తర్వులను అమల్లోకి తెచ్చారు. భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో రాష్ట్రాల విలీనం జరిగిన నేపథ్యంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు  ఉద్యోగ, ఉపాధి, విద్య తదితర అన్ని రంగాల్లో  సమాన అవకాశాలను కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ ఉత్తర్వులు అమల్లోకి తెచ్చారు.

అయితే రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత కూడ ఈ రెండు రాష్ట్రాల్లో కూడ  ఈ జోన్ల వ్యవస్థ కొనసాగుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఇటీవలనే  తమ రాష్ట్రానికి అనుగుణంగా జోన్లను మార్చేసింది. 31 జిల్లాలను తెలంగాణలో ఏర్పాటు చేసినందున రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 31 జిల్లాలకు గాను 7 జోన్లతో పాటు రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేశారు. ప్రతి జోన్‌లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు రిజర్వ్ చేశారు. 5శాతం ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీలో ఉంటాయి.

రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నందున 371 డీ ని సవరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.కొత్త జోన్ల వ్యవస్థకు ఈ ఏడాది మే మాసంలో కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.అయితే కేంద్రప్రభుత్వం ఆమోదం లభించాల్సి ఉంది.

ఈ విషయమై ఈ ఏడాది మే మాసంలోనే కొత్త జోన్ల వ్యవస్థకు  ఆమోదం కోసం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాడు. కానీ, ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ లభించలేదు.  కానీ, ఆ సమయంలో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను కలిసి   కొత్త జోన్ల వ్యవస్థ కోసం  ఆమోదం తెలపాలని సీఎం కేసీఆర్ కోరారు.తాజాగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కొత్త జోన్ల వ్యవస్థకు  సీఎం కేసీఆర్ ఆమోదం  కోసం ప్రధాన మంత్రిని కోరే అవకాశం ఉంది. 

కొత్త జోన్లు అమల్లోకి రావాలంటే కేంద్రం ఆమోదం తప్పనిసరి. అయితే  కేంద్రంతో  టీఆర్ఎస్ సన్నిహితంగానే ఉంటుంది.రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కూడ  కేసీఆర్  ఎన్డీఏ అభ్యర్ధులకు మద్దతిచ్చారు. అవిశ్వాసం విషయంలో కూడ ఎన్డీఏకు టీఆర్ఎస్ మద్దతుగానే నిలిచింది. అయితే  జోన్ల విషయంలో  కేసీఆర్ సర్కార్ ప్రతిపాదనల పట్ల  మోడీ సర్కార్ ఏ రకంగా స్పందిస్తోందో చూడాలి. 

ఈ వార్త చదవండి:జోనల్ వ్యవస్థపై కుస్తీ: డీల్లీకి కేసీఆర్, మోడీ వింటారా?

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios