Asianet News TeluguAsianet News Telugu

Union Budget 2024 : తెలంగాణకు రూ.25,639 కోట్ల కేటాయింపులు

2023-24లో తెలంగాణకు పన్నుల వాటా కింద 23,400 కోట్లు కేటాయించగా.. ఈ మధ్యంతర బడ్జెట్లో దీనికి మరో రూ.2,239 కోట్లు చేర్చారు. దీంతో బడ్జెట్ రూ.  25,639 కోట్లకు చేరింది.

Union Budget 2024: Rs.25,639 crore allocation for Telangana - bsb
Author
First Published Feb 2, 2024, 10:23 AM IST | Last Updated Feb 2, 2024, 10:23 AM IST

హైదరాబాద్ : ఎన్నికల సంవత్సరం కావడంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటవ తేదీన మద్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు.  ఈ బడ్జెట్ మొత్తం రూ. 47,65,768 కోట్లతో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా తెలంగాణకు రూ. 25,639 కోట్లు  కేటాయించారు. ఈ బడ్జెట్ లో కొత్త పథకాలు ఏవి లేవు. తెలంగాణకు కేటాయించిన బడ్జెట్ కూడా కేంద్ర పన్నుల వాటా కింద మాత్రమే ప్రకటించారు.

2023-24లో తెలంగాణకు పన్నుల వాటా కింద 23,400 కోట్లు కేటాయించగా.. ఈ మధ్యంతర బడ్జెట్లో దీనికి మరో రూ.2,239 కోట్లు చేర్చారు. దీంతో బడ్జెట్ రూ.  25,639 కోట్లకు చేరింది. ఇక రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రూ.19,760.59 కోట్లు వస్తాయి. ఇక మరో 3200 కోట్లు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థల మంజూరు కింద రానున్నాయి. ఈ మూడు మాత్రమే పెద్దపద్దులు. తప్ప రాష్ట్రానికి చెప్పుకోదగిన కేటాయింపులు పెద్దగా లేవు.

ఒకటో తేదీనే జీతమా..! నా భార్య కూడా నమ్మట్లేదు... : సీఎం రేవంత్ తో ఓ ప్రభుత్వోద్యోగి

ఈ బడ్జెట్లో తెలంగాణ కేంద్రం నుంచి ఎక్కువగానే ఆశించింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం స్టీల్ ప్లాంట్ కు నిధులు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద మూడేళ్లకు రూ. 1800 కోట్లు విడుదల చేయాలని కోరింది కూడా. దీంతోపాటు హైదరాబాద్ - నాగపూర్ పారిశ్రామిక కారిడార్ కు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఒకవేళ దీనికి కనుక అనుమతులు ఇస్తే రాష్ట్రానికి 2,300 కోట్లు విడుదలవుతాయని  అంచనా వేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు గతంలో విజ్ఞప్తి చేశారు కూడా.

దీంతోపాటు అదనంగా రూ. 90 కోట్లు సైబర్ సెక్యూరిటీకి, మరో రూ.88కోట్లు  యాంటీనార్కోటిక్ బ్యూరో పటిష్టతకు ఇవ్వాలని కోరారు. దీంతోపాటు మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు మెట్రో రైలు రెండో దశకు నిధులు ఆశించారు. కానీ మద్యంతర బడ్జెట్లో వీటి మీద ఎలాంటి ప్రస్తావన లేదు.కేంద్రం ఎలాంటి హామీలు ఇవ్వలేదు. 

కానీ, రైల్వే బడ్జెట్ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలు భద్రతా ప్రాజెక్టులకు రూ.5071కోట్లు ఈసారి కేటాయించినట్లుగా  కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ తెలిపారు. 2021- 22 బడ్జెట్లో రూ.2420కోట్లు కేటాయిస్తే ఇప్పుడు రెండు సార్లు పెంచామని గుర్తు చేశారు. ఇప్పుడు 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ 109% పెరిగిందని.. అలా 571 కోట్లు అని తెలిపారు.  కాజీపేట కోర్ట్ ఫ్యాక్టరీకి ప్రధాన శంకుస్థాపన చేశారని చెబుతూనే రాష్ట్రంలో రైల్వేలకు పెట్టుబడులు ధరనీయంగా పెరిగాయని, తెలంగాణలో వందశాతం విద్యుదీకరణ పూర్తయ్యిందని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios