Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో మిడ్ వైఫరీ వ్యవస్థ భేష్.. యునిసెఫ్ ప్రశంసలు

దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో ప్రవేశపెట్టిన మిడ్ వైఫరీ వ్యవస్థ మీద యునిసెఫ్ ప్రశంసల జల్లు కురిపించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. 

UNICEF praises midwifery system in Telangana
Author
First Published Dec 30, 2022, 1:30 PM IST

మాతా, శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ ప్రశంసలు కురిపించింది. ప్రసవం సంబంధిత సేవలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, దిక్సూచిగా మారిందని అభినందించింది. తెలంగాణలో అందిస్తున్న ప్రసూతి సేవలు అద్భుతంగా ఉన్నాయని, సుఖ ప్రసవాలు జరిగేందుకు ఇవి దోహదం చేస్తున్నాయని పేర్కొంది. ‘ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎ హెల్థీ స్టార్ట్’  హాష్ ట్యాగ్ తో హైదరాబాద్ లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువు ఫొటోను జత చేసి, యునిసెఫ్ ట్వీట్ చేసింది.

ఇదిలా ఉండగా, డిసెంబర్ 14న తెలంగాణ ప్రభుత్వానికి మాతాశిశు సంరక్షణలో మరోసారి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం ప్రశంసల జల్లు కురిపించింది. మాతాశిశు సంరక్షణలో, గర్భిణుల సంరక్షణలో అత్యుత్తమ విధానాలను అవలంభిస్తుందని ప్రశంసించింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్ షాప్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణకు రెండు అవార్డులను ప్రకటించింది. 

దుబ్బాక హబ్సిపూర్‌లో ఉద్రిక్తత బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట

ఈ సందర్భంగానే తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మాతాశిశు మరణాల నివారణలో తీసుకుంటున్న చర్యలను అభినందించింది. డిసెంబర్ 14న ఢిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ అవార్డులను అందజేశారు. వీటిని రాష్ట్ర మెటర్నల్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ పద్మజ అందుకున్నారు. 

ఇదే సందర్భంలో దేశంలోనే మొదటిసారిగా మిడ్ వైఫరీ వ్యవస్థను తెలంగాణలో అమల్లోకి తీసుకురావడం మీద ప్రశంసలు కురిపించింది. హైరిస్క్ కేసులను గుర్తించడంలో.. త్వరితగతిన చికిత్స అందించడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని ప్రశంసల జల్లు కురిపించింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios