దుబ్బాక మండలం హబ్సిపూర్ లో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాటతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హైద్రాబాద్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ లో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. గోడౌన్ ప్రారంభోత్సవానికి మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ వచ్చిన సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

హబ్సిపూర్ లో వెయ్యి టన్ను గోడౌన్ ను ప్రారంభోత్సవం సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తలు మోహరించారు. రెండు పార్టీల కార్యకర్తలను మంత్రి హరీష్ రావు సర్ధి చెప్పారు. హబ్సిపూర్ నుండి దుబ్బాక బస్టాండ్ ప్రారంభోత్సవానికి మంత్రులు బయలుదేరారు. దుబ్బాక బస్టాండ్ విషయమై దుబ్బాక ఎమ్మెల్యే, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది. రాజీనామాల కు కూడా ఇద్దరు నేతలు సవాళ్లు విసురుకున్నారు.
