కట్టుకున్న భార్య, అత్త మామలు మానసికంగా వేధింపులకు గురి చేయడంతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హన్మకొండలో చోటు చేసుకుంది.
వర్క్ ఫ్రం హోం ఇష్టం లేని భార్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడి నుంచి అతడిని ఫోన్ ద్వారా మానసిక వేధింపులకు గురి చేసింది. దీంతో పాటు అత్తమామ కూడా లేనిపోని మాటలు అనడంతో మానసికంగా కృంగిపోయిన టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది.
కొత్త పార్టీ పెడతా .. బీజేపీలో చేరను : గులాంనబీ ఆజాద్ సంచలన ప్రకటన
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా జిల్లా శాయంపేట మండలం రాజుపల్లికి చెందిన కొండా రాకేష్ (28) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం విధానంలోనే విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వరంగల్ జిల్లా సంగెం మండలానికి చెందిన నిహారికతో పెళ్లి జరిగింది.
గులాం నబీ ఆజాద్ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే?
కొంత కాలం పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అయితే భార్యకు రాకేష్ వర్క్ ఫ్రం హోం చేయడం ఇష్టం లేదు. హైదరాబాద్ వెళ్లాలని పలు మార్లు భర్తతో చెప్పింది. అయితే వర్క్ ఫ్రం హోం అయిపోయే సరికి సిటీకి వెళ్దామని భర్త బదులు ఇచ్చాడు. ఈ విషయంలో దంపతులిద్దరికీ మధ్య కొంత విభేదాలు ఇచ్చాయి. దీంతో భార్య నిహారిక పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె ఐదు నెలల గర్భంతో ఉంది.
అత్యవసరం లేదు: బండి సంజయ్ యాత్ర నిలుపుదలపై దాఖలైన పిటిషన్ పై తెలంగాణహైకోర్టు
అక్కడి నుంచి భర్తతో ఆమె ఫోన్ లో మాట్లాడుతుండేది. కొంత కాలం క్రితం కూడా రాకేష్ కు వీడియో కాల్ చేసిది. భర్తను చనిపోవాలని, అలా చేస్తే తాను మరో వెళ్లి చేసుకునేందుకు వీలు ఉంటుందని చెప్పింది. దీంతో పాటు అత్త మామ కూడా అల్లుడితో దురుసుగా మాట్లాడటంతో అతడు మానస్తాపానికి గురయ్యాడు. ఈ పరిణామాలతో మానసికంగా కృంగిపోయిన అతడు ఆత్మహత్యే శరణ్యం అని భావించాడు. తను చనిపోవడానికి గల కారణాలను పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాకేష్ భార్య, అతడి అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.
