Ugadi 2022: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పేరులోనే ఐశ్వర్యాన్ని మూటగట్టుకున్న కొత్త సంవత్సరం ‘శుభకృత్’ అన్ని రంగాల్లో ప్రజలకు శుభం కలగాలని ఆకాంక్షించారు. తెలుగు వాళ్లంతా ఈ ఉగాదిని శుభకృత్ నామ సంవత్సరంగా జరుపుకుంటే.. తెలంగాణ యువత మాత్రం.. ఉద్యోగ నామ సంవత్సరంగా చేసుకుంటున్నారని కవిత అన్నారు.
Ugadi 2022: ఉగాది పండుగను పురస్కరించుకుని.. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త యేడాది తన పేరుతోనే శుభాలను తీసుకొస్తున్న ‘శుభకృత్’నామ సంవత్సరం, రాష్ట్ర ప్రజలందరికీ శుభాలను చేకూర్చాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు ఉగాది నుండే నూతన సంవత్సరం ఆరంభమౌతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండే ప్రారంభించుకుంటారని సీఎం పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, ఆ భగవంతుడి ఆశీస్సులతో పుష్కలమైన నీరు, పచ్చని పొలాలతో తెలంగాణ కళకళలాడిందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఉగాది నుంచి నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తారని, ఉగాది నుంచి రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రోత్సాహం అందిస్తోందన్నారు.
దేశంలోనే రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. యావత్ దేశం గర్వించేలా వ్యవసాయ రంగంలో తెలంగాణ అపూర్వమైన అభివృద్ధిని సాధించిందని. ఇప్పుడు అత్యధిక పంట దిగుబడితో ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్రానికి సవాలు విసురుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయికి చేరుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వ్యవసాయ అనుబంధ వృత్తులను బలోపేతం చేయడం ద్వారా తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామన్నారు.
‘వ్యవసాయం బాగుంటేనే సర్వ జనులు సంతోషంగా ఉంటారు’ అనే నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. వ్యవసాయ రంగం అభివృద్ధి తెలంగాణలోని యువతకు ఉత్పాదక ,సేవా రంగాలలో ఉపాధి అవకాశాలకు పరోక్షంగా సహాయపడిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ మధ్య కాలంలో అన్ని రంగాలు బలోపేతమయ్యాయని, శుభకృత్ సంవత్సరంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని, దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిందన్నారు. కోవిడ్ సమయంలో కూడా, తెలంగాణ వ్యవసాయ రంగం దేశ జిడిపి వృద్ధికి చాలా దోహదపడిందని ఆయన అన్నారు.
అలాగే.. ఎమ్మెల్సీ కవిత.. Ugadi పండుగను పురస్కరించుకుని..రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభం జరగాలని.. అందరి జీవితాల్లో శుభాలను తీసుకురావాలని కోరుకుంటున్నానన్నారు. తెలంగాణ ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో శుభాలను తీసుకరావాలని.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటునాన్నని అన్నారు.
Ugadi పచ్చడిలో ఉండే తీపి, చేదు, పులుపు, వగరు, కారం, ఉప్పు రుచుల మాదిరిగానే ప్రతి మనిషి జీవితంలో.. కష్టనష్టాలు, అనేక కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అన్ని సందర్భాల్లోనూ.. ధైర్యంగా జీవితంలో ముందడుగు వేయాలని సూచించారు. తెలుగు వాళ్లంతా ఈ ఉగాదిని శుభకృత్ నామ సంవత్సరంగా జరుపుకుంటే.. తెలంగాణ యువత మాత్రం.. ఉద్యోగ నామ సంవత్సరంగా చేసుకుంటున్నారని కవిత అన్నారు.
సీఎం కేసీఆర్ 90 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తుండటంతో తెలంగాణ యువత పరీక్షలకు సిద్ధమవుతున్నారని అన్నారు. ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు టీ- సాట్ ద్వారా టీవీలు, యూ ట్యూబ్‌లో ఉచితంగా అందుబాటులో ఉండే మెటీరియల్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా పిల్లలను ప్రోత్సహించాలని ఆడబిడ్డలందరినీ కోరుతున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
