Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ ఎఫెక్ట్.. మద్యం అనుకొని రసాయనం తాగి..

తాజాగా.. ఇద్దరు యువకులు మద్యం అనుకొని ఏదో రసాయనం తాగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరిలో చోటుచేసుకుంది.
 

two youth died by drinking  chemical water in yadadri
Author
Hyderabad, First Published Apr 30, 2020, 7:26 AM IST


కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ లాక్ డౌన్ లో మద్యం లభించక చాలా మంది అవస్థలు పడ్డారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి కొందరు పిచ్చిపట్లినట్లు ప్రవర్తించారు. ఆస్పత్రిలో చేరి చికిత్స కూడా తీసుకున్నారు.

తాజాగా.. ఇద్దరు యువకులు మద్యం అనుకొని ఏదో రసాయనం తాగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పట్టణానికి చెందిన షేక్ బాబా(35), రియాజ్(22) ప్లాస్టిక్, ఇతర చిన్న బొమ్మలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం వారు ప్లాస్టిక్ డ్రమ్మును శుభ్రం చేయడానికి రసాయన ద్రావణాన్ని వినియోగించారు.

ఆ ద్రావణం స్పిరిట్ వాసన రావడంతో.. మద్యం అలవాటు ఉన్నవారు కావడంతో.. అది తాగితే మత్తు వస్తుందని భావించారు. వెంటనే దానిని నీటిలో కలుపుకొని తాగేశారు. బుధవారం ఉదయం వారు అస్వస్థతకు గురవ్వగా జిల్లా కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios