హైద్రాబాద్ నగరంలోని మియాపూర్ లో ఇద్దరు యువకులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఇద్దరు యువకులు కత్తి,కర్రలతో దాడి  చేసుకున్నారు.ఈ దాడికి కారణాలు తెలియాల్సి  ఉంది.

హైదరాబాద్:నగరంలోని  మియాపూర్  లో  ఇద్దరు యువకులు మంగళవారంనాడు  రోడ్డుపై పరస్పరం దాడి  చేసుకున్నారు.  తీవ్రంగా గాయపడి ఇద్దరు రోడ్డుపై కుప్పకూలిపోయారు.  దీంతో స్థానికులు వారిని  ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై ఇష్టమొచ్చినట్టుగా  ఇద్దరు  యువకులు  కొట్టుకుంటూ  హల్ చల్ చేశారు.  ఒకరు కత్తితో  మరొకరిపై దాడి  చేశారు.  మరో వ్యక్తి  కర్రతో  దాడికి దిగాడు. ఈ  ఘర్షణలో ఇద్దరు  వ్యక్తులు  తీవ్రంగా గాయపడ్డారు. పరస్పరం దాడులకు దిగిన  ఇద్దరు  వ్యక్తులు  తీవ్ర గాయాలతో  రోడ్డుపైనే  కుప్పకూలిపోయారు గాయపడిన వారిలో ఒకరిని అంబులెన్స్ లో మరొకరిని  ఆటోలో ఆసుపత్రికి  తరలించారు. ఇరువురు యువకులు పరస్పరం  దాడి చేసుకోవడానికి గల కారణాలు  తెలియాల్సి  ఉంది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు