సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో  ఒకే ట్రాక్ పై  రెండు రైళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన  రెండో రైలు  లోకో పైలెట్  బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

హైదరాబాద్: సికింద్రాబాద్  రైల్వేస్టేషన్ లో  ఒకే ట్రాక్ పై  రెండు రైళ్లు  వచ్చాయి.  అయితే  ఈ విషయాన్ని  గుర్తించిన  లోకో పైలెట్  రైలుకు  బ్రేకులు వేయడంతో  పెద్ద ప్రమాదం తప్పిందని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ  కథనం తెలిపింది.  అయితే  ఈ విషయమై  రైల్వే శాఖాధికారులు  స్పందించాల్సి ఉంది.  ఈ విషయమై  రైల్వే శాఖాధికారులు  స్పందించలేదని ఆ కథనం పేర్కొంది.