Asianet News TeluguAsianet News Telugu

విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి...

అమెరికాలోని ఓజార్క్ సరస్సులో ఈతకు వెళ్లిన నలుగురు తెలుగు విద్యార్థుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. 

Two telangana students died after going swimming in USA
Author
First Published Nov 28, 2022, 2:13 PM IST

వరంగల్ : అమెరికా లో విషాదం చోటుచేసుకుంది. మిస్సోరీ రాష్ట్రంలో  ఇద్దరు విద్యార్థులు  ప్రమాదవశాత్తుమృత్యువాత పడ్డారు.  వీరిద్దరూ తెలంగాణకు చెందినవారే. మిస్సోరీ లో ఓజార్క్ అనే సరస్సు ఉంది. దీంట్లో ఈత కొడదామని  వీరిద్దరూ.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లారు. ఈ నలుగురు తెలుగు విద్యార్థుల్లో ఇద్దరు మృతదేహాలు లభించాయి. మరో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. మృతదేహాలు లభ్యమైన వారిలో వికారాబాద్కు చెందిన శివ దత్తు,  హన్మకొండకు చెందిన ఉత్తేజ్ లు ఉన్నారు.  గల్లంతైన మరో ఇద్దరు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.

మిస్సోరీ రాష్ట్రం లోని సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో ఈ నలుగురు తెలుగు విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో హన్మకొండ కు చెందిన ఉత్తేజ్ మరణించడంతో.. ఆ వార్త తెలిసిన తల్లిదండ్రులు ఝాన్సీ లక్ష్మి,  జనార్దన్ ల రోదనను ఆపలేకపోతున్నారు. ఉత్తేజ్ నిరుడు ఆగస్టులో అమెరికా  వెళ్ళాడు. అక్కడ హెల్త్ సైన్స్ డేటాలో ఉత్తేజ్ మాస్టర్స్ చదువుతున్నాడు. ఇక ఈ ప్రమాదంలో చనిపోయిన మరో వ్యక్తి  శివ దత్తు (25) వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన అపెక్స్ హాస్పిటల్ ఓనర్ వెంకటేశం, జ్యోతి దంపతులకు రెండో కొడుకు. శివదత్తు ఈ జనవరిలోనే  అమెరికాకి వెళ్ళాడు. శనివారం  వీకెండ్ కావడంతో స్నేహితులతో కలిసి  సరదాగా ఈతకు వెళ్ళాడు.  ఓజార్క్ సరస్సులో ఈత కొడుతూ  ఒక్కసారిగా ఇద్దరు మునిగిపోయారు. ఈ విషయం తెలిసిన శివ దత్త తల్లిదండ్రులు శోకసముద్రంలో  మునిగిపోయారు.

దొంగల ముఠాలతో చోరీలు చేయిస్తున్న కానిస్టేబుల్.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..

Follow Us:
Download App:
  • android
  • ios