కెటిఆర్ సూచన పాటించిన ఇద్దరు మంత్రులు 5వేల మొక్కలు నాటిన మంత్రులు మహేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డి హాజరైన వేలాది మంది విద్యార్థులు
తెలంగాణ సిఎం కెసిఆర్ తనయుడు, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల మంత్రి కెటిఆర్ జన్మదిన వేడుకలు ఆయన కోరిన రీతిలోనే జరుగుతున్నాయి. పూల బొకేలు తేవొద్దని ఆయన తన అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఆయన పిలుపునందుకున్నారు. అందులో ఇద్దరు కేబినెట్ మినిస్టర్లు కూడా కెటిఆర్ పిలుపునందుకుని కెటిఆర్ ఆదేశాలు పాటించారు.
కుత్బుల్లాపూర్ లోని బాచుపల్లి లో సాయినగర్ లో మంత్రి కేటీఆర్ జన్నదిన సందర్భంగా హరిత హారం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డి 5 వేల మొక్కలు నాటారు. నాటించారు. ఈ కార్యక్రమంలో వేలాది విద్యార్థులు పాల్గొన్నారు. ఎంఎల్ఏలు వివేకానంద గౌడ్, ఎంపీ మల్లారెడ్డి, ఎంఎల్సీ శంబీపూర్ రాజు, కలెక్టర్ ఎంవిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపి, ఎమ్మెల్సీ హరితహారం ప్రతిజ్ఞ చేశారు.
