పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన రెండు ప్రేమ జంటలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ జంట తమ ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకి తెలిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని స్వాతి, నవీన్ అనే ఇద్దరు యువతి యువకులు పురుగుల ముందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స  పొందుతున్న వీరిద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. వీరిద్దరి స్వస్థలం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం. నిన్న రాత్రి సిద్ధిపేట నుంచి భువనగిరి చేరుకున్న వారు రాత్రంతా ఇక్కడే ఉన్నారు.

Also Read:పార్క్ లో అడ్డంగా దొరికేసిన ప్రేమ జంట... బలవంతంగా పెళ్లిచేసి...

ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి స్థానిక ఖిల్లాపైకి చేరుకుని దానిని ఇద్దరు తాగారు. ఈ సంగతిని స్నేహితులకు చెప్పడంతో వారు వెంటనే 100కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఖిల్లాపైకి చేరుకుని ఇద్దరిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇక మరో ఘటనలో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్‌లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెద్దలు తమ ప్రేమకు అంగీకరించలేదని మనస్తాపానికి చెందిన యువతి, యువకులు ఆదివారం ఉదయం స్థానికంగా ఉన్న పార్క్‌లో పురుగుల మందు సేవించారు.

Also Read:వరసకు అక్కా తమ్ముళ్లు... ప్రేమ విఫలమై..

అనంతరం అపస్మారక స్ధితిలో పడిపోవడంతో మార్నింగ్‌వాక్‌కు వచ్చిన వారు నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ యువతి మరణించగా, యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. వీరిద్దరిని బోధన్‌కు చెందిన నవనీత, వెంకటేశ్‌గా పోలీసులు గుర్తించారు.