వరసకు వాళ్లిద్దరూ అక్కా, తముళ్లు. కానీ  ఆ విషయం తెలియక వారు ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. వారి కుటుంబసభ్యుల ద్వారా తాము వరసకు అక్కా, తముళ్లమౌతామని తెలిసి కుంగిపోయారు. దీంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన వికారాబాద్ లో చోటుచేసుకుంది.

Also Read భార్యను పంపడంలేదని కాల్పులు.. నిందితులు అరెస్ట్, నక్సెల్స్ తో సంబంధం.

పూర్తి వివరాల్లోకి వెళితే... వికారాబాద్ లో గురువారం ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. కామునిపల్లికి చెందిన మమత, ప్రశాంత్ లు ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. వారు వరసలు కలవక పోవడంతో... వారి ప్రేమను పెద్దలు అంగీకరించరనే మనస్తాపంతో వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.

కాగా.. వారిద్దరూ అకస్మాత్తుగా చనిపోవడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.