హైద్రాబాద్ ఛత్రినాక కందికల్ గేట్ వద్ద జరిగిన పేలుడులో ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన వీరేంద్రకుమార్ ను ఆసుపత్రికి తరలించారు. కెమికల్స్, టపాసులు కలిపి కాల్చడం వల్ల ఈ పేలుడు చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు. 

హైదరాబాద్: హైద్రాబాద్ Chatrinaka Blast ఘటనలో ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది.ఈ విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad ‌నగరంలోని పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నాడు పేలుడు చోటు చేసుకొంది. చత్రినాక కందికల్ గేట్ వద్ద ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో మరణించినవారిని పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన విష్ణు, జగన్నాథ్ గా గుర్తించారు. మృతులు వినాయక విగ్రహలు తయారు చేసే కార్మికులుగా పోలీసులు గుర్తించారు.

crackery, రసాయనాలు కలిపి పేల్చడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.ఒక గుంతలో కెమికల్స్,టపాసులు పెట్టి కాల్చారు. దీంతో పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వీరేంద్రకుమార్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.