కుమరంభీమ్  ఆసిఫాబాద్  జిల్లాలో ని వేర్వేరు   ప్రాంతాల్లో  ఇద్దరిపై  ఎలుగుబంటి  దాడికి దిగింది.  ఈ దాడిలో  గాయపడినవారిని  ఆసుపత్రికి తరలించారు. 


ఆసిఫాబాద్:కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని వేర్వేరు చోట్ల ఇద్దరిపై ఎలుగు బంటి శుక్రవారం నాడు దాడికి దిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కుమరంభీమ్ జిల్లాలోని లోనవెల్లిలో వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడికి దిగింది. ఇదే జిల్లాలోని టోమ్కినిలో పొలానికి వెళ్లిన భువనేశ్వర్ పై ఎలుగుబంటి దాడికి దిగింది. ఎలుగు బంటి దాడుల్లో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.గతంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలుగుబంటి దాడుల్లో పలువురు గాయపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకిడిసింగి గ్రామానికి చెందిన కలమట కోదండరావుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో గాయపడిన కోదండరావు మృతి చెందాడు. ఈ ఘటన 2022 జూన్ 21న చోటు చేసుకుంది. ఇదే గ్రామంలో ఎలుగుబంటి రెండు ఆవులపై దాడి చేసి చంపింది. ,