హైద్రాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్: ఇద్దరు మాజీ వీసీలు అరెస్ట్

మధ్యప్రదేశ్ లోని సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్శిటీ నుండి నకిలీ సర్టిపికెట్లు తయారు చేసి హైద్రాబాద్ కు సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Two held in fake educational certificates racket In Hyderabad

హైదరాబాద్: Fake Certificates  తయారీ కేసులో Hyderabad పోలీసులు పురోగతి సాధించారు. Madhya Pradesh  రాష్ట్రంలోని సర్వేపల్లి Radha Krishna  యూనివర్శిటీలో వీసీలుగా పనిచేసిన ఇద్దరిని బుధవారం నాడు హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఇప్పటికే ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్‌ యూనివర్సిటీ  నుంచి  హైద్రాబాద్ నగరంలోని విద్యార్థులకు వందల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు సరఫరా అయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేతన్‌ సింగ్‌తో పాటు మూడు కన్సల్టెన్సీల నిర్వాహకులను ఇప్పటికే అరెస్టు చేశారు.

 ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మరో కన్సల్టెన్సీ నిర్వాహకుడిని కటకటాల్లోకి నెట్టారు.  కేతన్‌తో పాటు ఆ వర్సిటీ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి ఇ.విజయ్‌కుమార్‌కు ఈ స్కామ్‌లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Vijayawada కు చెందిన పీకే వీరన్నస్వామి బతుకుదెరువు కోసం Hyderabad కు వలసవచ్చాడు. చాదర్‌ఘాట్‌ పరిధిలో వీఎస్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇందులో ఆశించిన మేర ఆదాయం లేకపోవడంతో నకిలీ సర్టిఫికెట్ల దందా మొదలుపెట్టాడు. 

 కేతన్‌ సింగ్‌తో పాటు విజయ్‌కుమార్‌తో ఒప్పందం చేసుకున్నాడు.డ్రాప్‌ఔట్స్, బ్యాక్‌లాగ్స్‌ ఉన్న వాళ్లతో పాటు ఫెయిల్‌ అయిన విద్యార్థుల వివరాలను కాలేజీల నుంచి సేకరిస్తున్నాడు. ఆ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సంప్రదిస్తున్న వీరన్న స్వామి ఎలాంటి అడ్మిషన్లు, పరీక్షలు లేకుండా సర్టిఫికెట్లు ఇస్తానని ఒప్పందాలు చేసుకుంటున్నాడు. 

also read:నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్ల కేసు.. 2015లోనే అరెస్టైన నాగమణి..

 వీరన్న ఈ విద్యార్థులు, నిరుద్యోగుల వివరాలను వాట్సాప్‌ ద్వారా వర్సిటీలో ఉన్న కేతన్, విజయ్‌లకు పంపిస్తున్నాడు. వీటి ఆధారంగా బ్యాక్‌ డేట్స్‌తో డిగ్రీలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు యూనివర్సిటీలోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఇలా తయారు చేసిన డిగ్రీలను కోర్సును బట్టి రూ.80 వేల నుంచి రూ.2.5 లక్షలు వరకు విక్రయిస్తున్నా రు. కొన్నాళ్లుగా ఈ దందా గుట్టుగా సాగుతోంది. 

ఈ సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సై శ్రీకాంత్‌ తదితరులతో కూడిన బృందం కన్సల్టెన్సీపై ఈ ఏడాది ఫిబ్రవరి 22న దాడి చేసింది. గతంలో అరెస్టైన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఆధారాలను సేకరించిన పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని ఇవాళ అరెస్ట్ చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios