ప్రమాదకర రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్: హైద్రాబాద్ కాటేదాన్ లో ఇద్దరి అరెస్ట్

హైద్రాబాద్ కాటేదాన్ ప్రాంతంలో  నకిలీ  అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న  ఇద్దరిని  పోలీసులు అరెస్ట్  చేశారు. 

 Two held for making adulterated Ginger Garlic paste in Hyderabad lns

హైదరాబాద్: నగరంలోని  కాటేదాన్ లో  ప్రమాదకర రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న  ఇద్దరు సభ్యులను  ఎస్‌ఓటీ  పోలీసులు  శనివారం నాడు  రాత్రి అరెస్ట్  చేశారు. కాటేదాన్ లో  కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్  చేస్తున్న  సంస్థపై  ఎస్ఓటీ  పోలీసులు దాడి నిర్వహించారు.  కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్,   మామిడికాయ జ్యూస్ , నాన్ వెజ్  మసాల ప్యాకెట్లను  పోలీసులు సీజ్ చేశారు.  నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో  ప్రమాణాలు పాటించడం లేదు.  ఈ సంస్థకు అసలు అనుమతి లేని విషయాన్ని  పోలీసులు గుర్తించారు.  నాసిరకం అల్లం, వెల్లుల్లి,   మురుగు నీరు,  ఆసిటిక్ యాసిడ్ ను  ఉపయోగించి  అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్నారు. 

నాసిరకం అల్లం వెల్లుల్లిని  ఉపయోగించడం వల్ల  ఘాటు కోసం ఆసిటిక్ యాసిడ్ ను ఉపయోగిస్తున్నారని పోలీసులు గుర్తించారు.  చిన్న పిల్లలు ఎక్కువగా  ఇష్టపడే మామిడి పండ్ల రసాన్ని ఆకర్షణీయమైన   ప్యాక్ లో  విక్రయిస్తున్నారు. నాన్ వెజ్ మసాలు కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. 
 టన్ను అల్లం వెల్లుల్లి పేస్టు, మ్యాంగో జ్యోస్,  నాన్ వెజ్  మసాల ప్యాకెట్లు మార్కెట్ కు  తరలించే  సమయంలో ఎస్ఓటీ  పోలీసులు  దాడి  చేశారు. శనివారంనాడు రాత్రి  ఎస్ఓటీ పోలీసులు కాటేదాన్ లోని  ఫ్యాక్టరీపై దాడి  చేశారు. దీంతో  మార్కెట్ కు  తరలించే   అల్లం వెల్లుల్లి పేస్ట్ ను  సీజ్  చేశారు. నకిలీ  అల్లం వెల్లుల్లి పేస్ట్ సహా  ఇతర పదార్ధాలను  పోలీసులు సీజ్ చేశారు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఇద్దరిని  పోలీసులు అరెస్ట్  చేశారు.

ఇటీవల కాలంలో  నకిలీ  ఆహారపదార్ధాలు తయారు చేస్తున్న  సంస్థలపై పోలీసులు  దాడులు  చేస్తున్నారు.  నకిలీ ఐస్‌క్రీం,  చిన్న పిల్లలు ఎక్కువగా  ఇష్టపడే  చాక్లెట్లు , బిస్కట్లు గడువు తీరిపోయిన తర్వాత  కూడా  విక్రయిస్తున్న ముఠాను  గతంలో  పోలీసులు అరెస్ట్  చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios