నల్గొండలో విషాదం: ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు మృతి

సోషల్ మీడియాలో తమ ఫోటోలను మార్ఫింగ్ చేశారని మనోవేదనతో  ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు విద్యార్థినులు  మృతి చెందారు.ఈ ఘటన నల్గొండలో విషాదాన్ని నింపింది.

 Two Degree Students Committed Suicide in  Nalgonda lns

ed Suicide in  Nalgonda lns

నల్గొండలో విషాదం: ఆత్మాయత్నాయత్నం చేసిన ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు మృతి


నల్గొండ: ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు విద్యార్థినులు  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  బుధవారంనాడు మృతి చెందారు.  ఈ ఘటనపై  పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలోని  నార్కట్ పల్లి మండలానికి చెందిన ఇద్దరు విద్యార్ధినులు  నల్గొండలోని ప్రభుత్వ డిగ్రీ  కాలేజీలో చదువుతున్నారు.  వీరిద్దరూ  నల్గొండలోని హస్టల్ లో  ఉంటున్నారు. వీరిద్దరూ తమ ఫోన్లలో ఉన్న డీపీలోని ఫోటోలను తీసుకొని మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

also read:వాట్సప్ డీపీలతో మార్ఫింగ్.. అశ్లీలంగా మార్చి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు.. ఇద్దరు యువతుల ఆత్మహత్యాయత్నం..

 ఈ విషయాన్ని గుర్తించిన  బాధిత విద్యార్థులు మనోవేదనకు గురయ్యారు.  దీంతో  వీరిద్దరూ  ఈ నెల 5వ తేదీన  ఎన్‌జీ కాలేజీకి వెనుక ఉన్న పార్క్ కు వెళ్లి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు  వారిని నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  అయితే  నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బాధిత విద్యార్థినులు బుధవారంనాడు మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి బాధిత విద్యార్ధినుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మృతిచెందిన  విద్యార్థినులది నార్కట్ పల్లి మండంలోని పక్క పక్క గ్రామాలు.  చిన్నతనం నుండి వీరిద్దరి మధ్య స్నేహం ఉంది.  అంతేకాదు వీరిద్దరూ  నల్గొండలోని ప్రభుత్వ డిగ్రీకాలేజీలో చదువుతున్నారు. వాట్సాప్ డీపీలుగా తమ ఫోటోలను విద్యార్ధినులు పెట్టుకున్నారు. అయితే  ఈ ఫోటోలను దుండగులు అశ్లీలంగా మార్చి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.ఈ  విషయం దృష్టికి రావడంతో  బాధిత విద్యార్థినులు ఇతర విధ్యార్ధినులతో తమ మనోవేదనను పంచుకున్నారు.   పార్క్ కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే వారిని  స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారిద్దరూ ఇవాళ మృతి చెందారు.ఈ ఘటన  నల్గొండలో విషాదాన్ని నింపింది.  విద్యార్థినుల మృతికి కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలని మృతుల పేరేంట్స్ కోరుతున్నారు.

ఆత్మహత్యలు పరిష్కారం కాదు

ప్రతి సమస్యకు  ఓ పరిష్కారం ఉంటుంది.  సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.  జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios