రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. రెండు కార్లు మితిమీరిన వేగంతో ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కార్లలో ఉన్న ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. 

శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి వెళ్తుండగా నార్సింగి సర్కింల్ వద్ద రెండు కార్లు అతివేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీ కొట్టాయి. దీంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.  క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే గచ్చిబౌలి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 

కారు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికిి కారణం మద్యం సేవించడమేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలుస్తోంది. 

కార్లలో ప్రయాణిస్తున్న వారంతా సూర్యాపేటకు చెందినవారుగా  పోలీసులు తెలిపారు. ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.