సోమవారం మధ్యాహ్నం పక్క గదిలో ఓ బాలుడు లోపల నుంచి గడియ పెట్టుకోవడంతో కిటికీలో నుంచి Iron red సాయంతో బసుదేవ మల్లిక్ తీసే ప్రయత్నం చేశాడు. వెనుక ఉన్న 11 కేవీ Electrical wiresకు ఇనుప చువ్వ తగలడంతో కరెంట్ షాక్ వచ్చింది.

హైదరాబాద్ : బతుకుదెరువు కోసం వచ్చిన ఓ కుటుంబంలో current shock చీకట్లు కమ్ముకునేలా చేసింది. ఇంటి యజమాని, చిన్న కుమార్తె కరెంట్ షాక్ తో మృత్యువాత పడగా, భార్య ఆస్పత్రిలో విషమ పరిస్థితుల్లో ఉంది. పెద్ద కుమార్తె పాఠశాలకు వెళ్లడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది.

పటాన్ చెరు సీఐ శ్రీనివాసులు, ఎస్సై రామునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన బసు దేవ మల్లిక్ (36) పదేళ్ల క్రితం బతుకుదెరువు పటాన్ చెరు వచ్చాడు. ఇక్కి పాశమైలారం పారిశ్రామికవాడలో కిర్బీ పరిశ్రమలో పని చేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో ఇస్నాపూర్ ప్రముఖ్ నగర్ లో ఓ భవనం రెండో అంతస్తులో అద్దెకుంటున్నాడు. 

సోమవారం మధ్యాహ్నం పక్క గదిలో ఓ బాలుడు లోపల నుంచి గడియ పెట్టుకోవడంతో కిటికీలో నుంచి Iron red సాయంతో బసుదేవ మల్లిక్ తీసే ప్రయత్నం చేశాడు. వెనుక ఉన్న 11 కేవీ Electrical wiresకు ఇనుప చువ్వ తగలడంతో కరెంట్ షాక్ వచ్చింది. ఆ సమయంలో అతనితో పాటు అతని కాళ్ల దగ్గర ఉన్న రెండో కూతురు కున్ను మల్లిక్(2) అక్కడికక్కడే మృత్యువాత పడింది. 

అతన్ని కాపాడడానికి వచ్చిన అతని భార్య రేణు మల్లిక్ తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను చందానగర్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో వారి పెద్ద కుమార్తె బిద్యాద్రి మల్లిక్ పాఠశాలకు వెళ్లింది. ఘటనా స్థలాన్ని డీఎస్పీ భీమ్ రెడ్డి పరిశీలించారు. పెద్ద కుమార్తెను ఇస్నాపూర్ లో ఉంటున్న ఆమె చిన్నాన్న తీసుకెళ్లాడు. పటాన్ చెరు నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ తీగలు ఇల్లకు దగ్గరగా ఉండటంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 

Hyderabad ORR accident: లారీని ఢీకొట్టిన కారు, ఒకరు మృతి, కారులో ఇరుక్కున్న యువతి

ఇదిలా ఉండగా, తెలంగాణలోనే ఈ నెల మొదట్లో ఇలాంటి విషాదకర ఘటనే చోటు చేసుకుంది. స్వయంగా కన్నతండ్రే కూతురి కాళ్ల గజ్జెలకు కరెంట్ షాక్ పెట్టి చంపేశాడు. siddipet district తొగుట మండలం వెంకట్రావు పేటలో డిసెంబర్ 4న ఈ ఘటన జరిగింది. దౌల్తాబాద్ చెందిన సునీతను రెండేళ్ల కిందట వెంకట్రావుపేటకు చెందిన ఎం. రాజశేఖర్ వివాహమాడాడు. కొంతకాలం కాపురం సజావుగా సాగింది. వీరికి ఒక girl child కూడా పుట్టింది. పాప పుట్టినప్పటినుంచి సునీత పై రాజశేఖర్, అతని తల్లిదండ్రులు నరసవ్వ, యాదయ్య, చెల్లెలు సౌందర్య suspicious పెంచుకున్నారు.

ఈ అనుమానంతోనే తరచు కొట్లాట పెట్టుకునేవారు. సునీతను రకరకాలుగా వేధించేవారు. వీటిని తట్టుకోలేక రాజశేఖర్, సునీత తల్లిదండ్రుల ఇంటినుంచి అద్దె ఇల్లు చూసుకుని వేరుగా వచ్చేశారు. అక్కడ కొద్ది రోజులు బాగానే ఉన్నా.. ఆ తరువాత రాజశేఖర్ మళ్లీ మొదటికి వచ్చాడు. కొద్దిరోజులకే భర్త మనసు మార్చుకున్నాడు. తల్లిదండ్రుల వద్దే ఉందామంటూ సునీతతో ఘర్షణ పడుతున్నాడు.అదే క్రమంతో శుక్రవారం భార్యను ఇదే విషయమై తిట్టి, కొట్టి కుమార్తె ప్రిన్సి (11 నెలలు) ఎత్తుకొని బయటికి వచ్చాడు. నేరుగా తాను కౌలు చేస్తున్న భూమి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ప్రిన్సీ కాళ్ల గజ్జల కు తీగలు చుట్టి మోటార్ స్టార్టర్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యేలా చేశాడు.

కరెంట్ షాక్ తో చిన్నారి కన్నుమూసింది. తరువాత రాజశేఖర అక్కడే పురుగుల మందు తాగాడు. అంతకు ముందు మరో రైతుకి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఆ రైతు గ్రామస్తులకు సమాచారం అందించి... వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే కరెంట్ షాక్ తో పాప చనిపోయి ఉంది.