సెల్ఫీ దిగడానికి వాగులో దిగిన చిన్నారులుప్రమాదవశాత్తు నీటిిలో కొట్టుకుపోయిన చిన్నారులువారి జాడ కోసం వెతుకుతున్న స్థానికులు , గజ ఈతగాళ్లు
సెల్ఫీ మోజులో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం మున్నేరు వాగులో ఓ బండరాయిపై నిల్చుని సెల్ఫీ
దిగుతుండగా కాలు జారి ప్రమోద్, పల్లవి అనే చిన్నారులు నీట మునిగి చనిపోయారు.
వివరాల్లోకి వెళితే ఖమ్మం రూరల్ రాజీవ్ గృహకల్ప ప్రాంతానికి చెందిన ఉరుకొండ సంతోష్, రాధిక దంపతుల పిల్లలు ప్రమోద్, పల్లవి. కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న వీరు దసరా సెలవులు కావడంతో సరదాగా గడపడానికి తండ్రితో కలిసి మున్నేరు వాగు వద్దకు వెళ్లారు.అయితే అనుకోకుండా పిల్లలు ప్రమాదానికి గురై నీటిలో కొట్టుకుపోతుండటంతో ఈత రాని సంతోష్ ఎంత ప్రయత్నించినా కాపాడలేక పోయారు.
విషయం తెలుసుకున్న స్థానికులు భారీగా చేరుకుని పిల్లల కోసం వెలకడం మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి చిన్నారుల కోసం గాలిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి
