సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం శివారులో జాతీయ రహదారిపై మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై రెండు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఓ వార్తా పత్రిక రిపోర్టర్ నరేందర్ భార్యతో కలిసి కోదాడ నుంచి హైదరాబాద్ వైపు కారులో వెళ్తుండగా... హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న ఇండికా కారు డివైడర్ దాటి వచ్చి ఢీ కొట్టింది.

దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేశారు. కాగా కారులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రాణాలతో బయటపడటంతో వారంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.

కాగా... ఈ ఘటనతో వారంతా భయాందోళనకుల గురయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.