Asianet News TeluguAsianet News Telugu

మణికొండ నాలాలో గల్లంతైన రజనీకాంత్ కేసులో ఇద్దరు అరెస్ట్..

రాజధాని హైదరాబాద్ లోని మణికొండ ఏరియాలో గతనెలలో భారీగా కురిసన వర్షాలకు చోటుచేసున్న దుర్ఘటనలో..  డ్రైనేజీలో పడి రజనీకాంత్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గల్లంతయిన సంగతి తెలిసిందే. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు కొనసాగించారు. 

two arrested in manikonda software engineer rajinikanth death incident
Author
Hyderabad, First Published Oct 4, 2021, 10:20 AM IST

హైదరాబాద్ ((Hyderabad)మణికొండ ((Manikonda)మ్యాన్ హోల్ (Manhole)ఘటనలో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. గతవారం నాలాలో పడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (Software engineer)రజినీకాంత్ ప్రాణాలు కోల్పోయారు. కాంట్రాక్టర్ రాజ్ కుమార్, సబ్ కాంట్రాక్టర్ కుమారస్వామిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరి మీద పలు సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరు కాంట్రాక్టర్లను మున్సిపల్ అధికారులు సస్పెండ్ చేశారు. 

కాగా,  రాజధాని హైదరాబాద్ లోని మణికొండ ఏరియాలో గతనెలలో భారీగా కురిసన వర్షాలకు చోటుచేసున్న దుర్ఘటనలో..  డ్రైనేజీలో పడి రజనీకాంత్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గల్లంతయిన సంగతి తెలిసిందే. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు కొనసాగించారు. 

మణికొండ ఏరియాలోని గోల్డెన్ టెంపుల్ ముందు కొన్నాళ్లు డ్రైనేజీ వర్క్ జరుగుతున్నది. కొన్నాళ్లుగా ఇక్కడ పనిజరుతున్నా.. అక్కడ సైన్ బోర్డులు తప్పా మరేమీ ఏర్పాటు చేయలేదు. దీంతో వర్షాలు ఎక్కువగా కురవడంతో ఆ సైన్ బోర్డులూ కొట్టుకుపోయాయి. వరదలా నీరు ప్రవహిస్తుండటంతో అక్కడ డ్రైనేజీ వర్క్ జరుగుతున్నదన్న విషయమే తెలియకుండా పోయింది. అలా వరదలో అటువైపుగా వెళ్లిన ఓ వ్యక్తి డ్రైనేజీలో పడి కొట్టుకుపోయాడు.

మణికొండ నాలాలో రజనీకాంత్ గల్లంతు... తప్పు మాదే, బాధ్యత తీసుకుంటా: కేటీఆర్

అక్కడ కనీసం మూడు నెలల నుంచి వర్క్ జరుగుతున్నదని స్థానికులు చెప్పారు. కానీ, జాగ్రత్తగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. శనివారం నాలా వర్క్ చేసిన తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్త సూచనలు ఏర్పాటు చేయలేదని తెలిపారు. ఈ విషయాన్ని పాదచారులు గమనించకుండానే నడుస్తున్నారు. 

అయితే ఘటన జరిగిన సమయంలో .. నాలా ముందున్న ఇంట్లోని ఓ వ్యక్తి వరదను వీడియో తీస్తున్నాడు. అప్పుడే ఓ వ్యక్తి ఆ డ్రైనేజీలో పడినట్టు గుర్తించాడు. వెంటనే పోలీసులకు విషయాన్ని అందించాడు. వెంటనే పోలీసులు, డీఆర్ఎఫ్, మున్సిపల్ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. సోమవారం నాడు నెక్నామ్ పూర్ చెరువు వద్ద ఓ గుర్తు తెలియని మృతదేహన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బురదలో  ఈ మృతదేహం కూరుకుపోయింది. అయితే బురద కారణంగా ఈ మృతదేహన్ని గుర్తించలేదు.  చివరికి  ఈ డెడ్‌బాడీ మణికొండ నాలాలో గల్లంతైన రజనీకాంత్‌దిగా గుర్తించారు.

Follow Us:
Download App:
  • android
  • ios