Asianet News TeluguAsianet News Telugu

మణికొండ నాలాలో రజనీకాంత్ గల్లంతు... తప్పు మాదే, బాధ్యత తీసుకుంటా: కేటీఆర్

మణికొండ ఘటనలో నిర్లక్ష్యం తమదేనని ఒప్పుకున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రమాదంపై బాధ్యత తీసుకుంటున్నామన్న ఆయన.. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వున్నా మంత్రిగా  బాధ్యత తనదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. 

minister ktr comments on rajinikanth death incident in manikonda
Author
Hyderabad, First Published Oct 1, 2021, 6:13 PM IST

మణికొండ ఘటనలో నిర్లక్ష్యం తమదేనని ఒప్పుకున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రమాదంపై బాధ్యత తీసుకుంటున్నామన్న ఆయన.. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వున్నా మంత్రిగా  బాధ్యత తనదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ తరహా ఘటనలు జరగకుండా ఇకపై జాగ్రత్తగా వుంటామని బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు మంత్రి కేటీఆర్. ఈ ఘటనలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను సస్పెండ్ చేసినట్లు మంత్రి తెలిపారు. దీనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించామని కేటీఆర్ వెల్లడించారు. నగరంలోని చాలా చోట్ల ఇదే రకమైన పనులు జరగడం వల్ల కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు, గ్రౌండ్ లెవల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ ఘటనలు జరుగుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. 

Also Read:హైద్రాబాద్ మణికొండ డ్రైనేజీలో రజనీకాంత్ గల్లంతు: నెక్నామ్ చెరువులో డెడ్‌బాడీ లభ్యం

కాగా, హైద్రాబాద్(hyderabad) మణికొండలో (Manikonda) లో ఈ నెల 25వ తేదీన డ్రైనేజీలో పడిన రజనీకాంత్ మృతదేహన్ని సోమవారం నాడు నెక్నామ్ చెరువులో గుర్తించారు.ఈ నెల 25వ తేదీన మణికొండలో రోడ్డు దాటుతున్న సమయంలో మూతలేని మ్యాన్ హోల్ లో  రజనీకాంత్ అనే టెక్కీ పడి  కొట్టుకుపోయాడు. మూడు రోజులుగా రజనీకాంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నాడు నెక్నామ్ చెరువు వద్ద ఓ గుర్తు తెలియని మృతదేహన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బురదలో  ఈ మృతదేహం కూరుకుపోయింది. అయితే బురద కారణంగా ఈ మృతదేహన్ని గుర్తించలేదు.  చివరికి  ఈ డెడ్‌బాడీ రజనీకాంత్‌దిగా గుర్తించారు.

Follow Us:
Download App:
  • android
  • ios