నల్లగొండ జిల్లాలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన 17 ఏళ్ల బాలిక కేసు మలుపు తిరిగింది. ప్రేమోన్మాది ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.
నల్లగొండ: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో కొత్త విషయం వెలుగు చూసింది. జిల్లాలోని కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. జూలై 13వ తేదీన వ్యవసాయ బావి వద్ద ఆమె మృతదేహం అనుమానాస్పద స్థితిలో నకిపించింది.
తమ గ్రామానికే చెందిన దోరెపల్లి పవన్ ప్రేమిస్తున్నానంటూ తమ కూతురి వెంటపడుతున్నాడని, తమ కూతురిని అనతే హత్య చేశాడని ఆమె తల్లి నాగమ్మ, బంధువులో పోలీసుల వద్ద ఆరోపించారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు పెద్ద యెత్తున ఆందోళన చేపట్టడంతో డీఐజి రంగనాథ్ రంగంలోకి దిగారు.
కేసును విచారించడానికి ెస్పీ సతీష్ ను ప్రత్యేకాధికారిగా నియమించారు. ప్రస్తుతం అనుమానితుడు పవన్ ను పోలీసులు విచారిస్తున్నారు. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. హత్య చేయడానికి ముందు బాలికపై అతను అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక వస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉదిద.
ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ రామకృష్ణను డిఐజి రంగనాథ్ వీఆర్ కు పంపించారు. పారదర్శకంగా కేసు విచారణ జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. మతురాలి కుటుంబ సభ్యులను భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు
