మంత్రి పదవికి పట్నం రాజీనామా చేయాలి ఓయులో మహేందర్ రెడ్డి దిష్టబొమ్మ దగ్థం  టిఆర్ఎస్ లో ద్రోహులకు అందలమెక్కించారు టివియువి ఆగ్రహం

తెలంగాణ ఉద్యమకారుడు తాండురు నాయకుడు ఆయూబ్ ఖాన్ చావుకు మంత్రి పట్నం మహేందర్ రెడ్డే కారణమని టివియువి స్పష్టం చేసింది. ఆయూబ్ మృతికి బాధ్యత వహించి తక్షణమే మహేందర్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని టీవీయూవీ డిమాండ్ చేసింది.

ఈ సందర్భంగా శుక్రవారం ఉస్మానియా యూనివర్శిటీలో మహేందర్ రెడ్డి దిష్టి బొమ్మను తగలబెట్టారు. ఈ మేరకు టీవీయూవీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి రమేష్ ముదిరాజ్, సలీంపాషలు మాట్లాడుతూ " తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టి, ఉద్యమంలో వ్యతిరేకంగా పని చేసిన ద్రోహులను అందలమెక్కించారని మండిపడ్డారు.

ద్రోహులకు అందలమెక్కించిన కారణంగానే ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ద్రోహులను కేసీఆర్ యే తన కుటుంబ రాజకీయాల కోసం పెంచి పోషిస్తున్నడు అని విమర్శించారు. అందుకే, టీఆర్ఎస్ లో ఉన్న ఉద్యమకారులు బయటికి వచ్చి, టీజేఏసీ నాయకత్వంలోకి వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీవీయూవీ రాష్ట్ర కోఆర్డినేటర్ బాబూ మహాజన్, ఓయూ అధ్యక్షుడు శివరాం, గిరిబాబు, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి