హైదరాబాజ్: నిధుల మళ్లింపులు, ఫోర్జరీ కేసులో అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌, హీరో శివాజీ తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఈ మెయిల్‌ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు మరో పది రోజులు గడువు కావాలని వారు కోరారు. 

తాను వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనని రవిప్రకాశ్‌ ఈ మెయిల్‌లో తెలిపారు. సినీనటుడు శివాజీ కూడా తనకు ఆరోగ్యం సరిగా లేదని మెయిల్‌ పంపించారు. అయితే వీరిద్దరి ఈ మెయిల్స్‌పై పోలీసులు సంతృప్తి చెందలేదని సమాచారం.

ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినా రవిప్రకాశ్‌ నుంచి స్పందన లేదు. దీంతో తదుపరి చర్యలపై సైబరాబాద్ పోలీసులు దృష్టిపెట్టారు. ప్రస్తుతం రవిప్రకాశ్‌, శివాజీ విజయవాడలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపీలో తలదాచుకున్నారన్న సమాచారం మేరకు వీరిద్దరిని అదుపులోకి తీసుకునే విషయంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

తనపై పోలీసులు సీఆర్‌పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను విచారణకు చేపట్టాలన్న రవిప్రకాశ్‌ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. తదుపరి విచారణను వచ్చే జూన్‌కు వాయిదా వేసింది.  

సంబంధిత వార్తలు

టీవీ9 కేసులో సంచలనం: రవిప్రకాష్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

తెలంగాణ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది.. టీవీ9 రవి ప్రకాష్

హైకోర్టులో రవిప్రకాశ్ పిటిషన్ కొట్టివేత: అరెస్ట్‌కు పోలీసులు రెడీ

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి