హైదరాబాద్: టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు మిస్టరీగానే ఉంది. ఎప్పటికప్పుడు పరస్పర విరుద్ధమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఓ కొత్త వీడియో లీకైంది. ఇందుకు సంబంధించి మీడియాలో వార్తలు వచ్చాయి. దేవరాజ్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శ్రావణి మాట్లాడిన వీడియో విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దేవరాజ్ కు శ్రావణి వీడియో కాల్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. దానికితోడు, దేవరాజ్ గురించి అన్నీ మంచి విషయాలే చెప్పింది. నా ఫేవరేట్ హీరో దేవరాజ్ అని ఆమె ఆ వీడియో కాల్ లో ప్రశంసించింది. 

Also Read: శ్రావణితో దేవరాజ్ భోజనం సీసీటీవీ ఫుటేజీ సీజ్: అదే రోజు ఆత్మహత్య

"ఎంతో మంది పరిచయమైనా నువ్వు మాత్రమే స్పెషల్, నీలో నాకు ఎప్పుడూ మిస్టేక్ అనిపించలేదు. నా ఫ్యామిలీ మెంబర్ లా నువ్వు నాతో ఉన్నావు. నేను ఎక్కడున్నా నీకు శుభాకాంక్షలు చెప్తాను. నేను చాలాసార్లు హర్ట్ చేశాను. నేను ఎవరికీ సారీ చెప్పను. నీకు మాత్రమే చెప్తున్నాను. నిన్ను ఏమన్నా నన్ను తిరిగి ఒక్క మాట అనవు. నాకు ఫోన్ చేయి అప్పుడప్పుడు" అని శ్రావణి ఆ వీడియో కాల్ లో అన్నట్లు వార్తలు వచ్చాయి.

 

దేవరాజు రెడ్డిపై సాయికృష్ణ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దేవరాజ్ రెడ్డి అమ్మాయిలతో ఆడుకుంటాడని, పలువురు అమ్మాయిలతో అతనికి సంబంధాలున్నాయని సాయికృష్ణ ఆరోపించిన విషయం తెలిసిందే. పైగా దేవరాజ్ రెడ్డి ప్లే బాయ్ అంటూ కూడా వార్తలు వచ్చాయి. తాజా వీడియోను బట్టి చూస్తే శ్రావణికి, దేవరాజ్ రెడ్డికి మధ్య ఏ విధమైన గొడవలు లేవని అర్తమవుతోంది. 

Also Read: మరో మలుపు: శ్రావణి, ఆర్ఎక్స్100 సినీ నిర్మాత ఫోన్ సంభాషణ లీక్

దేవరాజ్ రెడ్డిని హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసులు గురువారం విచారించారు. ఈ కేసులో సాయికృష్ణకు పోలీసులు నోటీసు జారీ చేశారు. అతన్ని విచారించే అవకాశం ఉంది. ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి పేరు కూడా తెర మీదికి వచ్చింది. శ్రావణి, అశోక్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణల ఆడియో లీకైంది. ఈ సంభాషణలో అశోక్ రెడ్డి శ్రావణికి సలహాలు ఇచ్చారు. ఈ విషయంపై పోలీసులు అశోక్ రెడ్డిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.