హైదరాబాద్: టీవీ సీరియల్స్ నటి నాగఝాన్సీ ఆత్మహత్య కేసులో సూర్యతేజను హైదరాబాదులోని పంజాగుట్ట పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేసినట్టు సమాచారం. ఏడాది క్రితం ఇద్దరూ ప్రేమించుకున్నారు. నటన మానుకోవాలని ఆమెకు చెప్పడంతో ఇరువురి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. 

సూర్య ఒత్తిడితో ఆమె సీరియల్స్ లో నటించడం కూడా మానేసింది. అయినా కూడా సూర్య తనను దూరం పెట్టే ప్రయత్నం చేయడంతో ఝాన్సీ మనస్తాపానికి గురైంది ఫోన్‌ చేసినా సూర్యతేజ స్పందించలేదు. ఈనెల 5వ తేదీన ఝాన్సీ సూర్యకు ఫోన్‌ చేసింది. బిజీగా ఉన్నానంటూ సూర్యతేజ ఫోన్‌ కట్‌ చేయడంతో ఝాన్సీ మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని మరణించింది. 

సూర్య నమ్మించి మోసం చేయడమే కాకుండా అనవసరంగా అభాండాలు వేస్తున్నాడని నాగ ఝాన్సీ తల్లి సంపూర్ణ పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆరోపించింది. వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నాగ ఝాన్సీ సెల్‌ఫోన్‌లు, డైరీ స్వాధీనం చేసుకొని వాటిలోని వివరాలు సేకరించారు. 

చివరికి సూర్యతేజ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విచారించి ఐపీసీ 306, 417 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. సీపీ అంజనీకుమార్‌ కేసు వివరాలను అడిగి తెలుసుకొని పోలీసులకు సూచనలు ఇచ్చినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

ఝాన్సీ కేసు: సూర్యకు ఆమె పరిచయం చేసింది, బర్త్‌డే‌కు బైక్ గిఫ్ట్

టీవీ నటి ఝాన్సీ సూసైడ్: 'అతను లేనిదే నేను బతుకను', వేధింపులేనా..