హైదరాబాద్: సినీ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో కొన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సూర్య బర్త్‌డే రోజు సుమారు లక్షన్నర విలువైన బైక్‌ను ఝాన్సీ గిఫ్ట్‌గా ఇచ్చిందని  ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే మరో నటి ద్వారా సూర్య ఝాన్సీకి పరిచయమైనట్టుగా పోలీసులు గుర్తించారు.

టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో  పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఆదివారం నాడు సూర్యను పోలీసులు అదుపులోకి తిసుకొని ప్రశ్నిస్తున్నారు.మరో టీవీ నటి మధు ద్వారా సూర్య  ఝాన్సీకి పరిచయమైనట్టుగా ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు.

 బర్త్‌డే రోజున తమ ఇంటికి మధు, సూర్యలు కలిసి వచ్చారని ఝాన్సీ తల్లి గుర్తు చేస్తోంది. తొలుత ఓ టీవీ నటితో కూడ సూర్య లవ్ ఎఫైర్ సాగించి... ఆ తర్వాత ఆమెకు బ్రేకప్ చెప్పినట్టుగా ఝాన్సీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఝాన్సీ  నుండి సూర్య సుమారు రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకొన్నాడని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. అంతేకాదు సూర్య బర్త్ డే రోజున సుమారు రూ. లక్షన్నర విలువైన బైక్‌ను అతడి కోసం ఆమె గిఫ్ట్‌గా ఇచ్చిందని సూర్య  సోదరుడు చెబుతున్నారు.

మూడు మాసాలుగా  సూర్యకు,  ఝాన్సీకి మధ్య విబేధాలు చోటు చేసుకొన్నాయని పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

టీవీ నటి ఝాన్సీ సూసైడ్: 'అతను లేనిదే నేను బతుకను', వేధింపులేనా..