హైదరాబాద్:  సినీ నటి ఝాన్సీ  ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు సూర్య నుండి  పోలీసులు కీలక విషయాలను సేకరించారు. సీరియల్స్‌లో ఝాన్సీ నటించడాన్ని సూర్య తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే సూర్య చెప్పినా కూడ ఝాన్సీ వినకుండా సీరియల్స్‌లో నటించింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య దూరాన్ని పెంచిందని పోలీసులు గుర్తించారు.

టీవీ సీరియల్స్‌లో నటించే ఝాన్సీని సూర్యను ప్రేమించాడు. వీరిద్దరు కొంత కాలం సహజీవనం కూడ చేశారని పోలీసులు గుర్తించారు.  మరో వైపు పెళ్లి కూడ చేసుకోవాలని రెండు కుటుంబాల పెద్దలకు చెప్పారని ఝాన్సీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే  ఝాన్సీ సీరియల్స్‌లో నటించకూడదని  సూర్య షరతులు పెట్టాడు.  షూటింగ్‌లకు వెళ్లిన సమయంలో ఆమె అక్కడ సహచర నటీ నటులతో కలుపుగోలుగా ఉండడాన్ని సూర్య తట్టుకోలేక పోయేవాడని ఝాన్సీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  దీంతో ఎప్పుడూ అనుమానంతో రగిలిపోయేవాడన్నారు.  సీరియల్స్‌లో నటించడం మానుకో.... ఎవ్వరితో మాట్లాడొద్దు అని ఝాన్సీకి షరతులు పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారని సమాచారం.

తాను చెప్పినా వినకుండా  సీరియల్స్‌లో నటించేందుకు ఝాన్సీ వెళ్లిన సమయంలో  సూర్య ఫోన్ చేస్తే కట్ చేయడమో  లేదా....స్విచ్ఛాప్ చేసేదని సూర్య  గుర్తించాడు. ఈ ఘటనలు సూర్యకు మరింత కోపాన్ని తెప్పించాయి.

ఇదే సమయంలో  ఝాన్సీకి ఫోన్ చేయడాన్ని కూడ ఆయన తగ్గించినట్టు సమాచారం. ఝాన్సీ ఫోన్ చేసినా కూడ సూర్య పెద్దగా పట్టించుకొనేవాడు... ఒక వేళ మాట్లాడినా గతంలో మాట్లాడినట్టుగా మాట్లాడకుండా పొడి పొడిగా మాట్లాడేవాడంటున్నారు. కొన్ని రోజులు ఝాన్సీ ఫోన్‌ను  సూర్య బ్లాక్ చేశాడు. దీంతో ఝాన్సీ తీవ్రంగా మనోవేదనకు గురైనట్టుగా  పోలీసులు గుర్తించారు.

సూర్యకు నటన అంటే ఇష్టం లేదని గుర్తించిన ఝాన్సీ...  నటనకు దూరమైంది. బ్యూటీ పార్లర్‌ను తెరిచింది. ఇదే సమయంలో తనకు ఇష్టమైన నటనకు దూరమైంది. అదే సమయంలో ప్రియుడు కూడ దూరం పెట్టడంతో  ఝాన్సీ కలత చెందినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

తన డైరీలో రాసుకొన్న కొన్ని విషయాలను పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు సూర్యతో మాట్లాడాలని ఝాన్సీ ప్రయత్నించింది. కానీ అతను మాత్రం తాను బిజీగా ఉన్నాను... మనసు బాగోలేదని చెప్పినట్టు సమాచారం.

అయితే అదే సమయంలో సుమారు 14 మేసేజ్‌లను ఝాన్సీ పెట్టింది. అదే సమయంలో ఏడవొద్దు.. నేను వస్తున్నానను అంటూ సూర్య  కూడ మేసేజ్ పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే  అప్పటికే ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా గుర్తించారు. ఝాన్సీ తనకు రూ.2 లక్షల విలువైన బైక్‌ను గిఫ్ట్ గా ఇచ్చిందని ఆయన పోలీసుల విచారణలో ఒప్పుకొన్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

ఝాన్సీ కేసు: సూర్యకు ఆమె పరిచయం చేసింది, బర్త్‌డే‌కు బైక్ గిఫ్ట్

టీవీ నటి ఝాన్సీ సూసైడ్: 'అతను లేనిదే నేను బతుకను', వేధింపులేనా..