శివలింగం మీద తేలు లాంటొడు: కేసీఆర్ పై తుమ్మల సెటైర్లు

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై  బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది.ఈ జిల్లాలో  మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేసింది. మరో వైపు  ఈ జిల్లాలో  తమ పట్టును నిలుపుకోవాలని  కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది.

Tummala Nageswara rao satirical comments on  KCR lns

ఖమ్మం:   శివలింగం మీద తేలు లాంటి వాడు  కేసీఆర్ అని మాజీ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.ఆదివారంనాడు ఖమ్మం పట్టణంలోని పలు ప్రాంతాల్లో  తుమ్మల నాగేశ్వరరావు  ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా  ఆయన  ప్రసంగించారు. తేలును కొడదామంటే  కింద తెలంగాణ అనే లింగం ఉందన్నారు. ఓటు అనే ఆయుధంతోనే ఆ తేలును కొట్టాలని  తుమ్మల నాగేశ్వరరావు  చెప్పారు. 
ఎంతోమంది బలిదానాలతోనే తెలంగాణ వచ్చిన విషయాన్ని తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేశారు. తెలంగాణ తన ఒక్కడిదే అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.  రాష్ట్రంలో అరాచకపాలనను తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.

2014 ఎన్నికల్లో  ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి  టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన  తుమ్మల నాగేశ్వరరావు  ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.  ఎమ్మెల్సీని చేసి తన మంత్రివర్గంలోకి తుమ్మల నాగేశ్వరరావును తీసుకున్నారు కేసీఆర్. మాజీ మంత్రి, పాలేరు ఎమ్మెల్యే  రాంరెడ్డి  వెంకట్ రెడ్డి  అనారోగ్యంతో  మరణించడంతో  పాలేరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.ఈ ఉప ఎన్నికల్లో  బీఆర్ఎస్ అభ్యర్ధిగా తుమ్మల నాగేశ్వరరావు  పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా  రాంరెడ్డి వెంకట్ రెడ్డి  సతీమణి  పోటీ చేసి  ఓటమి పాలయ్యారు. 

2018 ఎన్నికల్లో  పాలేరు నుండి  తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేశారు. అదే స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో  తుమ్మల నాగేశ్వరరావు  ఓటమి పాలయ్యారు.  ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో  కందాల ఉపేందర్ రెడ్డి  కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో  ఈ ఎన్నికల్లో పాలేరు టిక్కెట్టును  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కాకుండా  కందాల ఉపేందర్ రెడ్డికే బీఆర్ఎస్ కేటాయించింది. పాలేరు నుండి పోటీ చేయాలని  తుమ్మల నాగేశ్వరరావు  రంగం సిద్దం చేసుకున్నా బీఆర్ఎస్ నాయకత్వం  మొండిచేయి చూపింది. దీంతో అసంతృప్తికి గురైన తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

also read:వివేకంతో ఓటేయాలి: టీడీపీ శ్రేణులను కోరిన తుమ్మల నాగేశ్వరరావు

ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో  తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ లో చేరారు.  ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ తరపున  ఖమ్మం అసెంబ్లీ నుండి  తుమ్మల నాగేశ్వరరావు  బరిలో నిలిచారు.  పొత్తులో భాగంగా  కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి కేటాయిస్తున్నందున  పాలేరు నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.  దీంతో  దీంతో పాలేరు కాకుండా  ఖమ్మం నుండి బరిలోకి దింపాలని  కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios