హైదరాబాద్: .జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్  విషయంలో తాము ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు రివ్యూ పిటిషన్ ను దాఖలు చేయనుంది.

also read:ఎస్ఈసీ ఉత్తర్వులు: ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ

బ్యాలెట్ పేపర్లపై స్వస్తిక్ గుర్తు కాకుండా పెన్నుతో పాటు టిక్ గుర్తు పెట్టినా కూడ వాటిని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నాడు రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.ఈ  ఉత్తర్వులపై బీజేపీ  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన  ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. 

స్టాంప్, టిక్ పెట్టిన ఓట్లను కూడ ప్రత్యేకంగా లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం  ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.  ఓట్ల కంటే మెజారిటీ ఎక్కువగా ఉంటే ఫలితం ప్రకటించవచ్చని తెలిపింది.

హైకోర్టు ఉత్తర్వులను పరిశీలించాలని కోరుతూ ఎన్నికల సంఘం హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తోంది.ఈ రివ్యూ పిటిషన్ ను స్వీకరించాలంటూ న్యాయస్థానాన్ని కోరనుంది.