Asianet News TeluguAsianet News Telugu

మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ..

మేడారం (medaram) వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ (telangana RTC) గుడ్ న్యూస్ చెప్పింది. జాతర కోసం 6 వేల అదనపు బస్సులు నడపనుంది. మేడారం జాతర (Medaram Jathara) ను ఆర్టీసీ దత్తత తీసుకుందని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యల తీసుకుంటున్నామని వీసీ సజ్జనార్ (TSRTC MD VC Sajjanar) తెలిపారు.

TSRTC announces good news for devotees going to Medaram..ISR
Author
First Published Feb 6, 2024, 12:19 PM IST

తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధం పెట్టింది. ఇప్పటికే ఈ జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కూడా భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలని ఆర్టీసీ సంకల్పించింది. దీని కోసం ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర కోసం 6 వేల అదనపు బస్సులను నడపనుంది.

హైస్పీడ్ ఏరియల్ టార్గెట్ ‘అభ్యాస్’ ప్రయోగం సక్సెస్.. దీంతో ఉపయోగాలు ఏంటంటే ?

ఈ మేరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఆర్టీసీ బస్సుల కోసం పార్కింగ్ సదుపాయాలను, ఇతర ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఆర్టీసీ ప్రతినిధులతో కలిసి సోమవారం పరిశీలించారు. తాడ్వాయిలోని టికెట్ బూత్ లు, కామారంలోని మూడు బస్ స్టాప్ లు, తాత్కాలిక బస్ టెర్మినల్, బేస్ క్యాంప్, మేడారంలో 55 ఎకరాల్లో ఏర్పాటు చేసిన నలభై ఎనిమిది క్యూ కంచెలను పరిశీలించారు. జాతర కోసం కేటాయించిన ఆ బస్సుల్లో కూడా మహాలక్ష్మీ పథకం వర్తించనుంది. 

ఈ సందర్భంగా మంత్రులు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పనితీరును మెచ్చుకున్నారు. మహాలక్ష్మి పథకం కింద రూ.14.50 కోట్లకు పైగా ప్రయాణికులు సురక్షితమైన ప్రయాణం అందిస్తున్నారని కొనియాడారు. కాగా.. ఈ నెల 16న మేడారంలో ఆర్టీసీ బేసిక్ క్యాప్ ప్రారంభం కానుంది. మేడారం జాతరలో సుమారు 14 వేల మంది ఆర్టీసీ కార్మికులు పని చేయనున్నారు. వారికి వసతి, భోజనాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

తల్లి కోసం బస్సు ఆపలేదని చేజింగ్.. అరగంట పాటు ఆపేసి యువకుడి ఆందోళన (వీడియో)

మేడారం జాతరను టీఎస్ ఆర్టీసీ దత్తత తీసుకుందని ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాని అన్నారు. జాతరకు 30 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ ను బట్టి బస్సులను కేటాయించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఏటా గణనీయమైన సంఖ్యలో యాత్రికులు మేడారం సందర్శిస్తుంటారని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios