Asianet News TeluguAsianet News Telugu

తల్లి కోసం బస్సు ఆపలేదని చేజింగ్.. అరగంట పాటు ఆపేసి యువకుడి ఆందోళన (వీడియో)

తల్లి కోసం బస్సు ఆపలేదని ఆ యువకుడికి కోపం వచ్చింది. తల్లిని బైక్ పై కూర్చొబెట్టుకొని ఆ బస్సును చేజ్ చేసి, నిలువరించాడు. (The youth protested that the bus did not stop for his mother) అరగంట పాటు ఆందోళన చేశాడు. ఈ ఘటన సిద్ధిపేట  (siddipet) జిల్లాలో జరిగింది.

Chasing that the bus did not stop for the mother.. Stopped for half an hour, youth's agitation (Video)..ISR
Author
First Published Feb 6, 2024, 10:41 AM IST | Last Updated Feb 6, 2024, 10:41 AM IST

తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తోంది. దీనిని చాలా మంది మహిళలు ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. అయితే బస్సులన్నీ రద్దీగా ఉంటుండటంతో అందరికీ సీట్లు దొరకడం కొంత కష్టంగా మారుతోంది. దీని వల్ల మహిళలు తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్  మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హైస్పీడ్ ఏరియల్ టార్గెట్ ‘అభ్యాస్’ ప్రయోగం సక్సెస్.. దీంతో ఉపయోగాలు ఏంటంటే ? 

ఈ పథకం ప్రారంభమైన దగ్గరి నుంచి ఆర్టీసీ సిబ్బందిపై ఒత్తిడి పడుతోంది. దీని వల్ల కొన్ని సందర్భాల్లో మహిళల కోసం బస్సులు ఆపేందుకు మొగ్గు చూపడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం బస్టాండ్ లో ఓ మహిళ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కటికేనపెల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహిళలను చూసి ఆర్టీసీ బస్సులు ఆపడం లేందంటూ ఆమె సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. 

తాజాగా సిద్ధిపేట జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. సిద్దిపేట జిల్లాలో ఓ మహిళను చూసి డ్రైవర్ బస్సు ఆపలేదు. దీంతో ఆమె కుమారుడికి కోపం వచ్చింది. వెంటనే బైక్ పై తల్లిని కూర్చొబెట్టుకొని బస్సును చేజ్ చేశాడు. ఆ బస్సును రోడ్డుపై నిలువరించాడు. అరగంట పాటు బస్సును ఆపివేసి ఆందోళన చేశాడు. తన తల్లి కోసం బస్సు ఎందుకు ఆపలేదని డ్రైవర్ ను నిలదీశారు. 

వావ్.. కాశ్మీర్ హిమపాతాన్ని రిపోర్టింగ్ చేసిన చిన్నారులు.. ఆనంద్ మహీంద్ర ఫిదా.. వైరల్

యువకుడి నిరసన వల్ల అరగంట పాటు బస్సు కదలలేదు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు రోడ్డుపైకి వచ్చారు. అటుగా వెళ్లే వాహనదారులు కూడా అక్కడే ఆగిపోయారు. ఏం జరిగిందని ఆరా తీశారు. యువకుడికి సద్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios