ఈ నెల 11న జరగనున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కు 15 ని.ల ముందే గేట్లు మూసేస్తామని  టీఎస్పీఎస్సీ తెలిపింది. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11న ప్రిలిమినరీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. 53 గ్రూప్ వన్ సర్వీసు ఉద్యోగాల కోసం ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అయితే ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు.. సమయానికంటే 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రంలో ఉండాలని అధికారులు తెలిపారు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ హాల్ గేట్లు మూసేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది. 

పరీక్ష పదిన్నరకు కావడంతో.. ఉదయం 10.15ని.ల తరువాత అభ్యర్థులను ఎవరిని లోపలికి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇది అభ్యర్థులందరూ గమనించాలని కోరింది. దీంతోపాటు పరీక్ష రాసే అభ్యర్థులందరికీ టీఎస్పీఎస్సీ పలు సూచనలు చేసింది...

తెలంగాణలో రాబోయే మూడ్రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వివరాలు ఇవే..

- ఓఎంఆర్ పత్రంలో తప్పులు చేస్తే దానికి బదులు కొత్తది ఇవ్వబడదు.
- ఓఎంఆర్ షీట్ లో పర్సనల్ డీటెయిల్స్ ను.. ఆన్సర్లను బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో సరిగా బబ్లింగ్ చేయాలి. 
- సరైన విషయం వివరాలను బబ్లింగ్ చేయకపోయినా…
- బబ్లింగ్ కోసం పెన్సిల్, ఇంకు పెన్, జెల్ పెన్ ఉపయోగించిన ఆ సీట్లు చెల్లుబాటు కావు.
- డబుల్ పబ్లిక్ చేసిన షీట్లను కూడా పరిగణలోకి తీసుకోరు.
- పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఆధార్, పాన్ కార్డు,డ్రైవింగ్ లైసెన్స్ లాంటి.. అభ్యర్థుల ఫోటోలతో కూడిన ప్రభుత్వ గుర్తింపు కార్డులు తీసుకురావాలి.
- గవర్నమెంట్ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు కూడా ఉండాలి.
- ఈ విషయంలో ఎవరైనా అక్రమాలకు పాలు పడితే వెంటనే కేసులు నమోదు చేస్తాం.
- డిఎస్పీఎస్సీ కమిషన్ నిర్వహించే పరీక్షలు ఇకముందు రాయకుండా డిపారు చేస్తాం..

ఈ నిబంధనలో అభ్యర్థులు గుర్తుపెట్టుకుని పరీక్షకు హాజరు కావాలని టీఎస్పీఎస్సీ కోరింది.