కొలువుల భర్తీ పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది టీఎస్‌పీఎస్సీ. 5 నియామక పరీక్షలకు రీ షెడ్యూల్ విడుదల చేసింది.
కొలువుల భర్తీ పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది టీఎస్‌పీఎస్సీ. 5 నియామక పరీక్షలకు రీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23న జరగాల్సిన ఏఎంవీఐ పరీక్ష జూన్ 28కి వాయిదా వేసింది. ఏప్రిల్ 25న జరగాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష జూన్ 16కు వాయిదా వేసింది. మే 7న జరగాల్సిన డ్రగ్ ఇన్స్‌పెక్టర్ పరీక్ష మే 19కి వాయిదా వేసింది. గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ గెజిటెడ్ పరీక్ష జూలై 18కి వాయిదా వేసింది. అలాగే నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్షల రీషెడ్యూల్ జూలై 20న జరగనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
