Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు: కేసీఆర్‌ వద్దకు ఫైలు


తెలంగాణలో  ఛార్జీలను పెంచాలని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. పల్లె వెలుగు బస్సులకు కి.మీ 25 పైసలు,ఎక్స్‌ప్రెస్ బస్సులకు 30 పైసలు,సిటీ ఆర్డినరీ బస్సులకు కి.మీ 25 పైసలుమెట్రో డీలక్స్ బస్సులకు 30 పైసలు పెంచాలని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు.  

TS RTC Decides to hike Bus Charges
Author
Hyderabad, First Published Nov 7, 2021, 1:13 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీల పెంపునకు రంగం సిద్దమైంది. Rtc ని నష్టాల నుండి గట్టెక్కించేందుకు గాను Bus Chargeలను పెంచాలని నిర్ణయం తీసుకొంది.ఛార్జీలను పెంచుతామని గతంలోనే తెలంగాణ సీఎం  Kcrప్రకటించారు.

also read:కేసీఆర్ ఎఫెక్ట్: ఏపీలోనూ వడ్డన స్టార్ట్, పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు

ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఆర్టీసీ ఛైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్,  ఆర్టీసీ ఈడీలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆర్టీసీ చార్జీల పెంపుపై చర్చించారు.

పల్లె వెలుగు బస్సులకు కి.మీ 25 పైసలు,ఎక్స్‌ప్రెస్ బస్సులకు 30 పైసలు,సిటీ ఆర్డినరీ బస్సులకు కి.మీ 25 పైసలు
మెట్రో డీలక్స్ బస్సులకు 30 పైసలు పెంచాలని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు.  చార్జీల పెంపు ప్రతిపాదనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు.

కి.మీకి 20 పైసలు చొప్పున పెంచితే రూ.625కోట్లు,25 పైసలు చొప్పున పెంచితే దాదాపు రూ.750 కోట్లు, 30 పైసలు పెంచితే రూ.900 కోట్లు మేర ఆదాయం పెరుగుతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.కి.మీకి 25 పైసలు చొప్పున పెంచే ప్రతిపాదనకు ఆర్టీసీ అధికారులు మొగ్గుచూపారు..

చివరిసారిగా తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆర్టీసీ చార్జీలు పెంచింది.ఆ సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.68 ఉంది. ఈ సమయంలో 20 పైసల  మేర పెంచింది.దీంతో ప్రజలపై ఏటా రూ.550 కోట్లు భారం పడింది.ఈ రెండేళ్లలో పెట్రోల్,డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం ఆర్టీసీకి రాయితీ కింద ఇచ్చే లీటర్ డీజిల్ ధర రూ.90కి చేరువగా ఉంది. ఇప్పుడున్న చార్జీలతోనే ఆర్టీసీని నిర్వహిస్తే మరింత నష్టం తప్పదని సంస్థ అధికారులు,ప్రభుత్వం భావిస్తోంది.ఈ నేపథ్యంలోనే చార్జీల పెంపుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

గతంలో చార్జీలు పెంచినప్పటి నుంచి ప్రస్తుత ధరతో బేరీజు వేసుకుంటే లీటరుపై రూ.20కి పైనే ఎక్కువగా ఉంది. అప్పటితో పోలిస్తే నిత్యం అదనంగా రూ.1.22 కోట్ల కంటే ఎక్కువ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో చార్జీల పెంపు అనివార్యంగా మారిందని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్రం తాజాగా ఎక్సైజ్‌ సుంకంపై తీసుకున్న నిర్ణయంతో చమురు ధరలు కొంతమేర తగ్గాయి. లీటరు డీజిల్‌పై రూ.10 తగ్గడంతో ఆర్టీసీకి పెద్ద ఊరటగానే మారింది. దీంతో రోజువారీ వినియోగిస్తున్న 6.50 లక్షల లీటర్ల డీజిల్‌పై లెక్కగడితే రూ.65 లక్షలు నేరుగా ఆదా అవుతుంది. ఆర్టీసీ వినియోగిస్తున్న అద్దె బస్సులపై వచ్చే ఆదాను కూడా జోడిస్తే అది రూ.90 లక్షల వరకు చేరుకుంటుంది. 

ఇప్పటికే వందల కోట్లలో ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఈ నష్టాల్లో కొంత పూడ్చుకొనేందుకు  చార్జీలను పెంచాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న చార్జీలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలో చార్జీల పెంపు విషయమై అధికారులు ప్రతిపాదించారు.

డీజీల్ ధరలు ఇటీవల కాలంలో పెరిగాయి. దీంతో నష్టాలు మరింత ఎక్కువయ్యాయి. నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది, ఇందులో భాగంగా కార్గో సర్వీసులను ప్రారంభించింది. కార్గో సర్వీసులు ఆర్టీసికి లాభాలను తీసుకొస్తున్నాయి. 

ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. రైతులకు కూడా ఆర్టీసీ కార్గో సర్వీసులను ప్రారంభించింది. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ప్రయాణీకుల నుండి  ఫీడ్ బ్యాక్ తీసుకొంటూ ఆర్టీసీకి లాభాలు తీసుకొచ్చేందుకు సజ్జనార్ ప్రయత్నాలను ప్రారంభించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios