ఏర్పాటుకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక నగదురహితంగా టెంపుల్ టౌన్లు

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తెలంగాణ లోని అన్ని దేవాలయాల్లో నగదురహిత లావాదేవీలు నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు స్వైప్ మిషన్లు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

సీఎం కేసీఆర్ చేసిన సూచనలమేరకు ప్రధాన దేవాలయాలన్నింటిలోనూ నగదు రహిత విరాళాలు స్వీకరించేలా స్వైప్ యంత్రాలు ఏర్పాటుచేయనున్నట్లు దేవాదాయ శాఖామంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

అంతేకాకుండా ప్రతీ దేవాలయానికి ప్రత్యేకంగా వెబ్ సైట్లను ప్రారంభించి, ఆన్ లైన్ విరాళాలు పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు.

రాష్ట్రంలోని యాదాద్రి, కాళేశ్వరం, వేములవాడ, కొండగట్టు, బాసర దేవాలయాల్లో నగదురహిత లావాదేవీలు చేసేందుకు వీలుగా చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు.

దేవాలయ కాటేజీల బుకింగ్ నుంచి దర్శనం టికెట్లు, ప్రత్యేక పూజలు, ప్రసాదాల కొనుగోలు, కళ్యాణకట్ట చెల్లింపులు ఆన్ లైన్ లోనే చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోనున్నారు.